అత్యాచారం వల్ల గర్భం ధరించిన బాధితురాలికి తనకున్న చట్టపరమైన హక్కుల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చిన కేసు విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
26 వారాలకు పైబడిన గర్భం తొలగింపు కేసుల్ని పరిష్కరించడానికి రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మెడికల్ బోర్డులు ఏర్పరచాలని బాధితురాలి తరపు న్యాయవాది వీకే బిజ్జు.. కోర్టును కోరారు. న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం... కేంద్రానికి నోటీసులు పంపింది. మెడికల్ బోర్డుల ఏర్పాటు గురించి అభిప్రాయం తెలపాలని ఆదేశించింది.
20 వారాలకు పైబడిన గర్భాన్ని తొలగించుకునేందుకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం-1971లోని సెక్షన్-3 అనుమతించదు.
ఇదీ చూడండి: "ప్రభుత్వం భేష్....సైన్యానిది అద్భుత జోష్"