ETV Bharat / bharat

30 వేల పోస్టల్ జాబ్స్.. టెన్త్ పాసైతే చాలు.. ఎంపికైతే ఫ్రీగా ల్యాప్​టాప్! - పోస్టల్ జాబ్స్ 10 క్లాస్

Postal GDS notification 2023 : గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏకంగా 30 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

postal-gds-notification-2023
postal-gds-notification-2023
author img

By

Published : Aug 3, 2023, 5:41 PM IST

Postal GDS notification 2023 : తపాలా శాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా 30 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 40 వేలకు పైగా పోస్టులు ప్రకటించింది ఇండియా పోస్ట్. అందులో భాగంగా మే నెలలో 12,828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీని భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 జీడీఎస్ పోస్టుల కోసం ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే.. పదో తరగతి పాసైతే సరిపోతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 23 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్​లైన్ అప్లికేషన్లు https://indiapostgdsonline.gov.in/ ద్వారా మాత్రమే సమర్పించాలి. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే.. ఆగస్టు 24 నుంచి 26 మధ్య సవరించుకునే సమయం ఉంటుంది.

పరీక్ష లేకుండానే ఉద్యోగం..
బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) / డాక్ సేవక్ పోస్టులకు రాత పరీక్ష ఏమీ ఉండదు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్​లో వివరాలు పొందుపర్చారు.

అర్హతలు ఏంటంటే?

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి.
  • అయితే, పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో చదివి ఉండాలి.
  • దీంతో పాటు అభ్యర్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వేతనం ఇలా..

  • ఈ నోటిఫికేషన్​లో ఉద్యోగాన్ని బట్టి వేతనాలు నిర్ణయించారు.
  • బీపీఎం ఉద్యోగానికి వేతన శ్రేణి రూ.12 వేల నుంచి రూ.29,380గా ఉంటుంది.
  • ఏబీపీఎం/ డాక్ సేవక్​కు రూ.10 వేలు- రూ.24,470గా నిర్ణయించారు.

ఈ వయసు వారికే..

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 - 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • ఎస్​సీ, ఎస్​టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?
GDS posts in Telangana : దేశవ్యాప్తంగా మొత్తం 30,041 పోస్టులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్​లో 1058 ఖాళీలు భర్తీ చేస్తారు. తెలంగాణలో 961 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పని చేస్తే సరిపోతుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి.. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ ఇస్తారు. రోజువారీ కార్యకలాపాల కోసం ల్యాప్​టాప్/ కంప్యూటర్/ స్మార్ట్​ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.