ETV Bharat / bharat

రాత్రికి రాత్రే చెరువు మాయం- ఊరి జనమంతా షాక్- ఎక్కడంటే? - చెరువు దొంగతనం బిహార్

Pond Stolen In Bihar : వింత చోరీలు వెలుగు చూసే బిహార్​లో మరో విచిత్ర ఘటన జరిగింది. కబ్జాదారులు రాత్రికి రాత్రే ఓ చెరువును మాయం చేశారు. ట్రక్కుల్లో మట్టి తీసుకొచ్చి చెరువును పూడ్చేశారు.

pond-stolen-in-bihar
pond-stolen-in-bihar
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 1:42 PM IST

Pond Stolen In Bihar : బిహార్​లో మరో అసాధారణ ఘటన జరిగింది. దర్భంగా జిల్లాలో రాత్రికి రాత్రే ఓ చెరువు మాయమైంది. చెరువు స్థానంలో ఓ గుడిసె వెలిసింది. ఈ వింత ఘటనతో స్థానికులు అవాక్కయ్యారు.
దర్భంగా జిల్లాలో ఇటీవల భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ల్యాండ్ మాఫియా గతంలోనే ఈ చెరువుపై కన్నేసింది. ఓసారి ఈ చెరువును కబ్జా చేసేందుకు సైతం ప్రయత్నాలు చేశారు. అప్పుడు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్నాళ్ల పాటు కబ్జా ప్రయత్నాలు ఆగిపోయాయి. అయితే, ఆదివారం ఉదయం చూసేసరికి ఆ ప్రాంతంలో చెరువు కనిపించలేదు. చెరువు స్థానంలో ఓ గుడిసె ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

చేపల వేటకు వినియోగం
ఈ చెరువును స్థానికులు చేపల వేట కోసం ఎక్కువగా ఉపయోగించుకునేవారు. అలాంటిది ప్రస్తుతం ఆ చోట చెరువు ఆనవాళ్లు ఏమాత్రం కనిపించడం లేదు. చెరువును మట్టితో నింపి, పైన ఓ గుడిసె ఏర్పాటు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వచ్చే లోపే మాఫియా ముఠా అక్కడి నుంచి పారిపోయింది. అర్ధరాత్రి సమయంలో ట్రక్కులతో మట్టిని తీసుకొచ్చి చెరువును పూర్తిగా నింపేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

గతంలో ఎన్నో వింత చోరీలు
బిహార్​లో ఇలాంటి అసాధారణ ఘటనలు జరగడం కొత్తేమీ కాదు. గతంలో చిత్రవిచిత్ర చోరీలు ఈ రాష్ట్రంలో జరిగాయి. రెండేళ్ల క్రితం బెగూసరాయ్​లో జిల్లాలో రైలు ఇంజిన్​ను ముక్కలు ముక్కలుగా చేసి దోచుకెళ్లారు. ఈ ఏడాది సమస్తీపుర్​లో రెండు కిలోమీటర్ల పొడవైన రైలు పట్టాలను గతంలో చోరీ చేశారు దొంగలు. వినియోగంలో లేని రైలు పట్టాలను ఎత్తుకెళ్లిపోయారు. జనవరి 24న జరిగిన ఈ ఘటనలో అధికారుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రాథమిక విచారణ జరిపి డివిజన్ సెక్యూరిటీ కమిషనర్​ సహా ముగ్గురు ఉద్యోగులను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది.

రెచ్చిపోయిన దొంగలు.. మరో సెల్ టవర్ చోరీ.. 10 రోజుల్లో రెండో ఘటన

అప్పుడే నిర్మించిన రోడ్డును ఎత్తుకెళ్లిన స్థానికులు, 3కిలోమీటర్ల రహదారి మాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.