బంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. భారీ సంఖ్యలో జనం పోలింగ్‌లో పాల్గొన్నారు.
వర్షం వస్తున్నా.. ఓటు వేయడానికి లైన్లలో నిల్చున్నారు.
భవానీపుర్, జాంగీపుర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భవానీపుర్ అసెంబ్లీ స్థానం నుంచి బంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. మమతకు పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ పోటీ చేస్తున్నారు.
![polling continues in Bhabanipur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13216187_img1-4.jpg)
![polling continues in Bhabanipur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13216187_img1-3.jpg)
![polling continues in Bhabanipur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13216187_img1-2---copy.jpg)
![polling continues in Bhabanipur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13216187_img1-6.jpg)
![polling in odisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13216187_img1-9.jpg)
![polling in odisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13216187_img1-13.jpg)