ETV Bharat / bharat

'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్​కు పీకే ఝలక్​! - పీకే కాంగ్రెస్​

Poll strategist Prashant Kishor declines offer to join Congress

author img

By

Published : Apr 26, 2022, 3:57 PM IST

Updated : Apr 26, 2022, 5:23 PM IST

15:53 April 26

కాంగ్రెస్​లో చేరేందుకు ప్రశాంత్​ కిశోర్​ నిరాకరణ

Prashant Kishor declines Congress Offer: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​.. కాంగ్రెస్​లో చేరడం ఖాయం అనుకున్న తరుణంలో పార్టీకి షాక్​ తగిలింది. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్​ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన ట్వీట్​ చేశారు. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్​కు 'నాయకత్వం' అవసరమని పేర్కొన్నారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార తెరాస- ఐప్యాక్‌ మధ్య ఇటీవల ఒప్పందం జరగటమే.. పీకే కాంగ్రెస్‌లో చేరకపోవటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిని కాంగ్రెస్​ అధినాయకత్వం.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద భావించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

''సాధికారిత బృందంలో భాగం కావడం సహా ఎన్నికల బాధ్యత తీసుకునేందుకు కాంగ్రెస్​లో చేరాలన్న ప్రతిపాదనను తిరస్కరించా. నేను పార్టీలో చేరడం కన్నా.. కాంగ్రెస్​కు నాయకత్వం అవసరం. ఎన్నో నిర్మాణాత్మక సమస్యల్లో కూరుకుపోయిన పార్టీలో ఉమ్మడి సంకల్పం, సంస్కరణలు అవసరం.''

- ప్రశాంత్​ కిశోర్​, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త

2024 లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​ సన్నద్ధత కోసం ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా సీనియర్​ నేతలకు పీకే పవర్​ పాయింట్​ ప్రజెెంటేషన్​ ఇచ్చారు. ప్రశాంత్​.. ఎన్నికల వ్యూహాలు, నివేదికపై అధ్యయనం చేసేందుకు సోనియా గాంధీ.. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ తమ నివేదికను సోనియాకు అందజేసింది. అనంతరం 'ఎంపవర్డ్​ యాక్షన్​ గ్రూప్​ -2024' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సోనియా.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాల బాధ్యతను తీసుకోవాలని, అందుకోసం పార్టీలో చేరాలని ప్రశాంత్​ కిశోర్​ను కోరారు. అందుకు ఆయన తిరస్కరించినట్లు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా మంగళవారం ధ్రువీకరించారు. కాంగ్రెస్‌లో చేరాలన్న అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆహ్వానాన్ని పీకే తిరస్కరించినట్లు పేర్కొన్నారు. పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు.. ప్రశాంత్​ కిశోర్​కు ధన్యవాదాలు తెలిపారు.

''ప్రశాంత్​ కిశోర్​ ప్రజెంటేషన్​, చర్చల అనంతరం.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ 'సాధికారిత బృందం-2024'ను ఏర్పాటు చేశారు. అందులో భాగమయ్యేందుకు పీకేను కాంగ్రెస్​లో చేరాలని ఆహ్వానించారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్​కు సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ప్రశాంత్​ కిశోర్​కు ధన్యవాదాలు.''

- రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఇటీవల పీకే ముందుకొచ్చారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖంగా ఉండటం సహా ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్​ కోసం పనిచేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే సోనియా సహా పార్టీ అధిష్ఠానంతో పలుమార్లు భేటీ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు.

అదే కారణమా? అయితే.. ప్రశాంత్​ కిశోర్​ను కాంగ్రెస్​లో చేర్చుకోవాలంటే ఆయనకు ఓ షరతు విధించాలని ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పీకే పార్టీలో చేరాక మరే ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయవద్దని, ఎలాంటి సేవలు అందించవద్దని చెప్పినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ బంగాల్​లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్​లోనూ వైకాపా కోసం పని చేశారు. ప్రస్తుతం తెలంగాణలో తెరాసకు రాజకీయ వ్యూహకర్త సేవలందిస్తున్నారు. కాంగ్రెస్​ నేతలు విధించిన షరతుతో ఇప్పుడు ఆయన ఈ పార్టీలన్నింటికీ దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. కాంగ్రెస్​కు ఝలక్​ ఇచ్చారు ప్రశాంత్​ కిశోర్​.

పీకే సలహాలు, సూచనలతో.. 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగాలనుకున్న కాంగ్రెస్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటములు కాంగ్రెస్​కు పీడకలను మిగిల్చాయి. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇక పలువురు సీనియర్ల అసంతృప్తి, అంతర్గత కలహాలు మధ్య కాంగ్రెస్​కు రానున్న ఎన్నికలు.. సవాల్​ను విసురుతున్నాయి. కాంగ్రెస్​కు సమర్థ నాయకత్వం అవసరమని పీకే ట్వీట్​ చేయడం కూడా పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇవీ చూడండి: నకిలీ వైద్యుల నిర్వాకం- సంతానం కోసం వెళ్తే ప్రాణమే తీసేశారు!

అమరావతి ఎంపీ 'నవనీత్​ రాణా'కు మరో షాక్​.. ఆ వీడియో రిలీజ్!

Last Updated : Apr 26, 2022, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.