ETV Bharat / bharat

పేర్ల మార్పుపై 'మహా' కూటమిలో కొత్త చిచ్చు! - మహారాష్ట్ర పేర్ల మార్పిడి

ఔరంగాబాద్​తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల పేర్లు మార్చాలంటూ శివసేన చేసిన ప్రతిపాదనతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. శివసేన ప్రతిపాదనను మిత్రపక్షాలైన కాంగ్రెస్​, ఎన్​సీపీ వ్యతిరేకించాయి. ఈ తరుణంలో మహా వికాస్​ అఘాడీలో చీలిక ఏర్పడినట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.

Politics In Maharashtra Over Renaming Cities
పేర్ల మార్పిడి చిచ్చుతో 'మహా' ప్రభుత్వంలో చీలిక!
author img

By

Published : Jan 7, 2021, 5:24 PM IST

నగరాలు, ఊర్ల పేర్లు మార్చే సంస్కృతి ఉత్తర్​ప్రదేశ్​ నుంచి మహారాష్ట్రకూ విస్తరించినట్టు కనపడుతోంది. ఔరంగాబాద్​ పేరు మార్చాలన్న శివసేన ప్రతిపాదనతో 'మహా' రాజకీయాలు వేడెక్కాయి. మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ​ మధ్య చిచ్చు రేగింది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది.

ఔరంగాబాద్​తో..

ఈ పేర్ల మార్పు వ్యవహారం ముందుగా ఔరంగాబాద్​తో మొదలైంది. ఇప్పటివరకు ఉన్న ఆ పేరును సంభాజీనగర్​గా మార్చాలని శివసేన ప్రతిపాదించింది. ఇది పార్టీ వ్యవస్థాపకుడు బాల్​ఠాక్రే కలగా అభివర్ణించింది.

శివసేన ప్రతిపాదనపై మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు బాలాసాహెబ్​ థోరట్​ మండిపడ్డారు. ఇలా పేర్లు మార్చే ప్రక్రియకు తాము వ్యతిరేకమని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి:- బెయిల్​పై బయటికొచ్చి చిన్నారిపై హత్యాచారం

కూటమిలో మరో పార్టీ అయిన ఎన్​సీపీ కూడా శివసేన నిర్ణయంతో విభేదించింది. ఈ ప్రతిపాదనను 20ఏళ్ల క్రితమే తిరస్కరించామని.. ఇప్పుడూ అదే చేస్తామని స్పష్టం చేసింది.

సమాజ్​వాదీ పార్టీ కూడా శివసేనకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పనులతో ప్రజల మధ్య మధ్య చిచ్చుపెట్టొదని హితవు పలికింది.

ఈ పూర్తి వ్యవహారంలో మరో కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చింది ప్రతిపక్ష భాజపా. ఔరంగాబాద్​ పురపాలక ఎన్నికల వేళ శివసేన ఈ ప్రతిపాదన చేసిందని.. ఓట్ల కోసం ప్రజల మనోభావాలపై రాజకీయం చేస్తోందని విరుచుపడింది.

లెక్క చేయని శివసేన..

అయితే ఇవేవీ లెక్క చేయని శివసేన.. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల పేర్లను మార్చేందుకు సన్నద్ధమవుతోంది. ఔరంగాబాద్​ ఎయిర్​పోర్ట్​ను ఛత్రపతి సంభాజీ మహారాజ్​ ఎయిర్​పోర్ట్​గా, పుణెను జిజాపుర్​గా, ముంబయి సెంట్రల్​ను నానా శంకర్​సేఠ్​ స్టేషన్​గా పేరు మార్చాలని యోచిస్తోంది. ఔరంగాబాద్​ ఎయిర్​పోర్ట్​ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేనే పౌర విమానయాన శాఖ మంత్రికి లేఖ రాయడం గమనార్హం.

మరోవైపు పేర్లు మార్పు చిచ్చుపై ఇప్పటికే ఊహాగానాలు జోరందుకున్నాయి. కూటమిలోని పార్టీలకు పడటం లేదని పుకార్లు బయటకువచ్చాయి. అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మూడు పార్టీల నేతలు చెబుతున్నారు.

ఇదీ చూడండి:- పీఎంసీ కేసులో సంజయ్​ రౌత్ భార్య విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.