ETV Bharat / bharat

ఎన్నికల వేళ 'ప్రచార రథాల' వైపు నేతల చూపు!

author img

By

Published : Jan 18, 2021, 7:53 PM IST

ఎన్నికల్లో ప్రచార వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రచార వేడిలో అలసిపోకుండా పలువురు నేతలు.. ఆధునిక హంగులతో వాహనాలను తయారు చేయించుకుంటారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి.. ఆ రాష్ట్ర నేతలు ప్రచార రథాలను సిద్ధం చేయించుకుంటున్నారు. ఇందుకోసం మినీవ్యానులు, టెంపో ట్రావెలర్స్‌ను ఎంచుకుంటున్నారు.

election campaign vehicles.
ఎన్నికల పథం.. ప్రచార రథం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు పార్టీలకు చెందిన ప్రచార తారలు కొయంబత్తూరు వైపు చూస్తున్నారు. ప్రచారానికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను కొయంబత్తూరులోని కోయా ఎంటర్‌ ప్రైజెస్‌ రూపొందిస్తోంది. నాయకుల అభీష్టానికి అనుగుణంగా.. ఆధునిక హంగులతో తయారు చేస్తోంది. గతంలో మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత ఇక్కడే.. తమ ప్రచార రథాలను తయారు చేయించుకున్నారు. సామాజిక మధ్యమాలు, టీవీల ద్వారా కంటే ప్రజల్లోకి వ్యక్తిగతంగా వెళ్లడం వల్లే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని నేతలు విశ్వసిస్తున్నారు. ఇందుకోసం వాహనాలను తయారు చేయించుకుంటున్నారు.

ఎన్నో ఆధునిక హంగులు..

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఈ ప్రత్యేక వాహనాల్లోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఓటర్లను ఆకర్షించడంతో పాటు నేతలు గంటల తరబడి సౌకర్యవంతంగా ప్రసంగించేందుకు ఇవి తొడ్పడుతాయి. కోయ సంస్థ రూపొందిస్తున్న ఈ ప్రత్యేక వాహనాల్లో అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో సేదతీరడానికి మంచం, సోఫా, ఏసీ, వంటగది, మైక్రో ఓవెన్, టాయ్‌లెట్‌, ఫ్యాన్లు, షవర్‌తో కూడిన బాత్‌రూం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే విధంగా.. హైడ్రాలిక్ ఫ్లాట్‌ ఫాంను ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్యనాయకులతో ఎన్నికల వ్యూహాలను చర్చించేందుకు వీలుగా వాహనాలను సమావేశపు గదులుగా తీర్చిదిద్దారు. ఇలాంటి వాటి కోసం మినీ వ్యానులు, టెంపో ట్రావెలర్స్ వాహనాలను ఎంచుకుంటున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచీ..

ప్రచార వాహనాల కోసం తమిళనాడు నుంచి మాత్రమే కాకుండా.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రచార వాహనాలను కోయంబత్తూర్‌తో పాటు సేలం, కరూర్‌ వంటి నగరాల్లో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 50 వేల ఓట్ల తేడాతో దీదీని ఓడిస్తా: సువేందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.