ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్​ పార్టీలను బలిపశువు చేశారు' - జమ్ముకశ్మీర్​ ముఫ్తీ

జమ్ముకశ్మీర్​లోని ప్రధాన పార్టీలను బలిపుశువులు చేశారని... ప్రతి ఒక్కరు తమపై నిందలు మోపుతున్నారని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. తమపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370ని పునరుద్ధరించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

Political parties in JK have become 'everybody's favourite whipping boy': Mehbooba Mufti
'జమ్ముకశ్మీర్​లోని పార్టీలను బలిపశువు చేశారు'
author img

By

Published : Jan 4, 2021, 5:56 AM IST

భాజపాపై జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్ర మెహబూబా ముఫ్తీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతి సమస్యకు ప్రధాన రాజకీయ పార్టీల వైఫల్యం కారణమని భాజపా తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు ఆరోపించారు. తమ ప్రాంతంలోని రాజకీయ పార్టీలు బలిపశువులుగా మారాయని.. ప్రతి ఒక్కరు తమనే లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

అయితే తమను ఎన్ని మాటలన్నా.. జమ్ముకశ్మీర్​ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు ముఫ్తీ. ఈ క్రమంలోనే.. అక్రమంగా రద్దు చేసిన ఆర్టికల్​ 370ని పునరుద్ధరించేంత వరకు తమ సుదీర్ఘ రాజకీయ పోరాటం కొనసాగుతుందన్నారు.

"జమ్ముకశ్మీర్​లోని ప్రధాన రాజకీయ పార్టీలు బలిపశువులుగా మారాయి. ఇది ఎంతో బాధాకరం. అందరూ మమ్మల్నే నిందించడానికి చూస్తున్నారు. మేము పాకిస్థాన్​కు అనుకులమని కేంద్రం చేసే తప్పుడు ప్రచారాలపై పోరాడుతూ ఉంటాం. మేము కశ్మీర్​ అభివృద్ధికి వ్యతిరేకమని అందరూ చేసే విమర్శలను ఎదుర్కొంటాం. ఈ ఆరోపణల్లో నిజం లేదు."

-- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.

'స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం..'

పీడీపీతో పాటు గుప్కార్​ కూటమిలోని ఇతర పార్టీలన్నీ.. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరిచేంతవరకు పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ముఫ్తీ వెల్లడించారు. ఇందుకోసం తాము శాంతియుతంగా, ప్రజాస్వామ్య మార్గాలను ఎంచుకున్నప్పటికీ.. తమపై భాజపా అక్రమంగా నేరారోపణలు మోపుతోందన్నారు.

పార్లమెంట్​లో తీసుకునే నిర్ణయాలన్నిటిని ప్రజలు ఆమోదించినట్టే అయితే.. ఆర్టికల్​ 370 రద్దు, సీఏఏ, సాగు చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్ల మీదకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు పీడీపీ అధినేత్రి. అప్రజాస్వామ్యంగా తీసుకున్నవాటిని.. ఏదో ఒక రోజు తిరిగి ఇచ్చేయాల్సిన సమయం వస్తుందని అభిప్రాయపడ్డారు.

ఆర్టికల్​ 370 రద్దుకు జమ్ముకశ్మీర్​ ప్రజలు వ్యతిరేకమన్న విషయం.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల వల్ల మరోమారు స్పష్టమైందన్నారు ముఫ్తీ.

భాజపాపై యుద్ధం, స్థానిక ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో గుప్కార్​ కూటమి 280 స్థానాల్లో 112 సీట్లను దక్కించుకుంది.

ఇదీ చూడండి:- ఆ​ గ్రామంలో పంచాయతీ పెద్ద​గా పాకిస్థాన్​ మహిళ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.