Political Heat in Medchal District : మేడ్చల్ నియోజకవర్గం రాజకీయ ఉద్దండులకు నిలయం. ఈ స్థానం నుంచి 1978లో గెలిచిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి.. ముఖ్యమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు. టీడీపీ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ మూడుసార్లు గెలిచి.. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మేడ్చల్ నుంచి విజయం సాధించిన మంత్రి మల్లారెడ్డిని కూడా అమాత్య పదవి వరించింది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్లు, మూడుసార్లు బీసీలు, రెండుసార్లు ఎస్సీలు ఒకసారి బ్రాహ్మణ నేత విజయం సాధించారు.
Political Parties Campaign in 2023 : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88 వేలకుపైగా ఓట్ల ఆదిక్యతతో మల్లారెడ్డి విజయభేరి మోగించారు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తోటకూర వజ్రేశ్‌యాదవ్, బీజేపీ నుంచి ఏనుగు సుదర్శన్‌రెడ్డి మంత్రికి గట్టి పోటీ ఇస్తున్నారు. మేడ్చల్(MEDCHAL) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, కేసీఆర్(KCR) నాయకత్వమే తనను గెలిపిస్తుందని మంత్రి మల్లారెడ్డి ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తనకు పోటీయే కాదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మంలో రసవత్తరంగా రాజకీయ 'ఆట' - సై అంటే సై అంటున్న అభ్యర్థులు
"నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. ఎన్నికలు అయినప్పుడు ఎవరోకరు ప్రత్యర్థులు ఉంటారు. నేను ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు చేశాను. ప్రతి ఊర్లో రోడ్లు వేయిపించాను. నా మీద పోటీ చేసిన వాళ్లు నాకన్న మంచి నాయకుల అనుకుంటే ఓట్లు వేసిన తప్పు లేదు."- మల్లారెడ్డి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి
BRS Leaders Campaign in Medchal : కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతలో బీజేపీ పట్ల ఉన్న ఆదరణతో గట్టెక్కుతానని ఆ పార్టీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్‌రెడ్డి అంటుండగా.. మంత్రి మల్లారెడ్డి వైఫల్యాలు, ఆరు గ్యారంటీలతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ చెబుతున్నారు.
BJP Leaders Campaign in Medchal : మేడ్చల్ నియోజకవర్గంలో 6 లక్ష 37 వేల 838 మంది ఓటర్లు ఉన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ప్రధాన సమస్యగా ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలు లేవు. అంతర్గత రహదారి సమస్యలు సహా అండర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ అంశాలు అభ్యర్థుల గెలుపొటముల్లో కీలకం కానున్నాయి.
Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు