Political Heat in Kodad District : కోదాడలో అధికార బీఆర్ఎస్(BRS), విపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వానేనా అని పోటీపడుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతిరెడ్డిపై..650 ఓట్ల స్వల్ప తేడాతో గులాబీ పార్టీ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్(Bollam Mallaya Yadav) గెలిచారు. నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదిస్తారని బొల్లం మల్లయ్య ధీమాగా చెబుతున్నారు. సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదనే కారణంతో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రతికూలం. బలమైన బీసీ వాదం, ప్రజా మద్దతుతో గట్టెక్కుతానని విశ్వాసంతో బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు.
"కోదాడలో 2019 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2450 కోట్ల నిధులను అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు పెట్టాం. సమస్యను తీర్చలేము అనుకున్న ఎన్నో వాటిని లేకుండా చేశాం. రాష్ట్రవ్యాప్తంగా భగీరథ పనులు మొదలుపెడితే.. ఆ పనులు మొదట ప్రారంభం కాలేదు. కల్యాణ లక్ష్మీ, సౌభాగ్య లక్ష్మీ పథకాలకు సంతకాలు పెట్టలేదు. నేను ఎమ్మెల్యే అయిన తరవాత మూడు, నాలుగు సంవత్సరాల్లో పెండింగ్ ఫైల్స్ అన్ని పూర్తి చేశాం. అభివృద్ధి చేశాం కావున ప్రచారంలో మరింత ముందుకు వెళ్తున్నాం. కచ్చితంగా ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేస్తారు. గులాబీ జెండా ఎగురుతుంది."- బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెబల్స్ టెన్షన్ - పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల పాట్లు
Congress Leaders Election Campaign in Kodad : నల్గొండ ఎంపీ ఉత్తమ్ సతీమణి పద్మావతిరెడ్డి(PadmaVathi Reddy) 2014 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్‌పై 13 వేల మెజార్టీతో గెలిచారు. 2018లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పటికే ఓ దఫా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసిన పద్మావతిరెడ్డి.. బొల్లంపై ఉన్న ప్రజా వ్యతిరేత తనను గెలిపిస్తుందనే భరోసాతో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ముఖ్య నేతలు అండతో పాటు ఎమ్మెల్యే వైఫల్యాలు తన గెలుపును నల్లేరుపై నడక చేస్తాయని చెబుతున్నారు.
"నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదు. నియోజకవర్గం అంతా అంధకారంలోకి వెళ్లింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకం నుంచి లంచాలు తీసుకుని పెద్ద స్కాంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు చేశారు. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ అధిక మెజారటీతో గెలుస్తుందని భావిస్తున్నాం.- పద్మావతిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి
Janasena BSP Election Campaign in Kodad : జనసేన(Janasena) నుంచి సతీశ్‌రెడ్డి, బీఎస్పీ తరఫున శ్రీను బరిలో ఉన్నపప్పటికీ కోదాడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు నెలకొంది. ఎన్నికల ప్రచారంలో ఇంటి ఇంటికీ తిరుగుతూ ఓటర్లలను తమ పార్టీకే ఓటు వేసేలా అభ్యర్థిస్తున్నారు.
పొలిటికల్ మ్యాజిక్- అభ్యర్థులు వారే గుర్తులే మారే
జోరందుకున్న ఎన్నికల ప్రచారం - మాకే ఓటేసి గెలిపించాలంటూ కోరుతున్న అభ్యర్థులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ హవానే కొనసాగుతుందా? త్రిముఖ పోరు తప్పదా?