పుదుచ్చేరి పోలీసు తనిఖీల్లో భారీస్థాయిలో బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. పూళితళ వద్ద సోదాలు నిర్వహిస్తుండగా.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ సంఖ్యతో ఉన్న వాహనంలో భారీస్థాయిలో రవాణా అవుతోన్న బంగారాన్ని కనుగొన్నారు. సుమారు 18 కిలోలున్న ఈ బంగారం ధర దాదాపు రూ.9కోట్లు ఉంటుందని తెలిపారు.
దీనిని కేరళలోని మలబార్ గోల్డ్ నగల దుకాణంలో డెలివరీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు వాహనంలో ఉన్న వ్యక్తులు తెలిపారని.. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ అంశంపై ఆదాయ పన్ను విభాగంతో పాటు.. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఆరు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎన్నికల వేళ రూ.170 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు