కర్ణాటకలో రేవ్ పార్టీలో పాల్గొన్న 130 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హసన్ జిల్లాలోని ఆలూర్ తాలుకా శివార్లలోని ఓ ఎస్టేట్లో శనివారం రాత్రి ఈ పార్టీ జరిగినట్లు వెల్లడించారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
మరో 20 లగ్జరీ కార్లు, 50కి పైగా బైకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్టేట్ యజమానిని అరెస్టు చేసి, అతడిపై కేసు నమోదు చేశారు.
కొవిడ్ కట్టడికి బెంగళూరు సహా 7 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ 'అత్యవసర సేవల' నెపంతో బెంగళూరు, మంగళూరు, గోవా సహా పలు ప్రాంతాల నుంచి జనం హాజరైనట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: కర్ణాటక మత్తు దందాలో కదులుతున్న డొంక