ETV Bharat / bharat

మరో దుశ్చర్య.. ఎస్సైని కాల్చి చంపిన ముష్కరులు - kashmir encounter

Police officer shot dead in J-K's Pulwama

author img

By

Published : Jun 18, 2022, 7:53 AM IST

Updated : Jun 18, 2022, 8:10 AM IST

07:49 June 18

మరో దుశ్చర్య.. ఎస్సైని కాల్చి చంపిన ముష్కరులు

SI Shot Dead: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని తన నివాసంలోనే ఓ ఎస్సైని కాల్చి చంపారు. మృతుడిని ఫరూక్​ అహ్మద్​ మీర్​గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత.. పాంపొర్​లోని సంబూరా ప్రాంతంలో సబ్​ ఇన్​స్పెక్టర్​పై దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లెథ్​పొరా సీటీసీ ఐఆర్​పీ 23వ బెటాలియన్​లో మీర్​ విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు.

కశ్మీర్​లో వరుసగా ఉగ్రఘాతుకాలు చోటుచేసుకుంటున్నాయి. హిందువులే లక్ష్యంగా ముష్కరులు దాడులు చేస్తున్నారు. ఈ ఘటనల్లో ఓ నటి, బ్యాంకు మేనేజర్​, జవాన్​ సహా పలువురు పౌరులు మృతిచెందారు. అనంతరం.. భద్రతా బలగాలు ఆ హత్యల్లో భాగమైన వారిని మట్టుబెట్టాయి. ఇప్పుడు మళ్లీ ఎస్సైని బలిగొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: ఈ ఏడాదే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు!

Last Updated : Jun 18, 2022, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.