ETV Bharat / bharat

'గుడి గంట'ల ముఠా అరెస్టు.. 100 టెంపుల్​ బెల్స్​ స్వాధీనం.. కారులో వెళ్లి చూసొచ్చి.. - కర్ణాటక లేటెస్ట్ న్యూస్

కర్ణాటకలో వరుస గుడి గంటల చోరీలు కలకలం రేపాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వరుస చోరీలకు సంబంధించిన ఈ కేసును చేధించిన పోలీసులకు ఎస్​ఐ రివార్డును ప్రకటించారు.

Police nab four accused in temple bells theft
గుడి గంటలు
author img

By

Published : Jan 11, 2023, 12:22 PM IST

కర్ణాటక వరుసగా గుడి గంటలు చోరీలు కలకలం రేపాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 750 కిలోల బరువున్న రూ.10 లక్షల విలువైన గుడి గంటలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిని మైసూర్​కు చెందిన అమ్జాద్ అహ్మద్(37), సమీవుల్లా (22), జుల్ఫికర్ (36), హైదర్ (36)గా గుర్తించారు. అరెస్టయిన నిందితులు కొడగుతో సహా అనేక జిల్లాల్లోని దేవాలయాల్లో గంటల దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

"అరెస్టయిన నిందితులు కొడగు, మైసూర్, హసన్ వంటి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. నిందితులు ఊరి బయట ఉన్న దేవాలయాలకు కారులో పగటి పూట వెళ్లి చూసి వచ్చేవారు. తర్వాత రాత్రి సమయంలో రాగి కట్లర్​ను ఉపయోగించి గుడి గంటలను దొంగిలించేవారు. పాత రాగికి మంచి ధర ఉన్నందున వాటిని దొంగిలించి విక్రయించారు."
- సూపరిండెంట్ పోలీస్ కెప్టెన్ ఎం.ఏ అయ్యప్ప

నాపోక్లు బేతు గ్రామంలోని శ్రీమక్కి శాస్తావు ఆలయంలోని 30 గంటలు సెప్టెంబరు 11న చోరీకి గురయ్యయి. అలాగే హలిగట్టు భద్రకాళి ఆలయంలో 10 గంటలు చోరీకి గురయ్యాయి. తెల్లవారు జామున రెండుగంటల సమయంలో ఈ గంటలను దొంగిలించారని పోలీసులు తెలిపారు. ఈ వరుస దొంగతనాలకు సంబంధించిన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుల నుంచి 100కు పైగా గుడి గంటలను, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చేధించిన పోలీసులకు సూపరిండెంట్ పోలీస్ కెప్టెన్ ఎం.ఏ అయ్యప్ప రివార్డును ప్రకటించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.