ETV Bharat / bharat

తుపాకీతో చైన్​ స్నాచర్​ వీరంగం.. చివరకు.. - చైన్ స్నాచర్​ వీరంగం

కాల్పులకు తెగబడ్డ ఓ చైన్​ స్నాచర్​.. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్​లో జరిగింది. నిందితుడు ఝార్ఖండ్​కు చెందిన ముర్తాసాగా పోలీసులు గుర్తించారు.

tamilnadu news
తుపాకీతో చైన్​ స్నాచర్​ వీరంగం
author img

By

Published : Oct 11, 2021, 10:05 PM IST

తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్​ ప్రాంతంలో ఓ చైన్​ స్నాచర్​ కలకలం సృష్టించాడు. తుపాకీతో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనలకు గురిచేశాడు. చివరికి పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది.

ఝార్ఘండ్​కు చెందిన ముర్తాసా.. శ్రీపెరంబుదూర్​లోని ఓ టోల్​ ప్లాజా వద్ద ఓ 55 ఏళ్ల మహిళ గొలుసును దొంగిలించాడు. అనంతరం అతనితో పాటు వచ్చిన మరో వ్యక్తి నయీమ్​ అక్తర్​తో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి ఆరుపులతో స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ముర్తాసా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా ముర్తాసా కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముర్తాసా మృతిచెందాడు. మరో నిందితుడు నయీమ్​ అక్తర్​ను అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈనెల 4న ఒరగదామ్​లో జరిగిన కాల్పుల ఘటనకు వీరికి సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : చదువంటే ఇంట్రెస్ట్​ లేదని ఇళ్ల నుంచి పరార్​.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.