ETV Bharat / bharat

ఎలుక మర్డర్ ​కేసు.. 30 పేజీల ఛార్జ్​షీట్ దాఖలు చేసిన పోలీసులు​.. ఆఖరికి!

ఎలుక తోకకు రాయి కట్టి.. దాన్ని నీళ్లలో ముంచి చంపేసిన కేసులో ఓ వ్యక్తిపై పోలీసులు కోర్టులో 30 పేజీల ఛార్జ్​షీట్​ దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూలో జరిగింది.

rat killing case budaun
rat killing case budaun
author img

By

Published : Apr 12, 2023, 7:18 AM IST

Updated : Apr 12, 2023, 7:32 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని బదాయూలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఎలుకను చంపిన వ్యక్తిపై పోలీసులు కోర్టులో 30 పేజీల ఛార్జ్​షీట్​ను దాఖలు చేశారు. ఎలుక తోకకు రాయిని కట్టి.. కాలువలో ముంచి చంపినట్లు ఓ వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన గతేడాది నవంబరులో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర​ ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..
కళ్యాణ్ నగర్​కు చెందిన మనోజ్​ కుమార్​.. ఎలుక తోకకు రాయిని కట్టి కాలువలో ముంచడం తాను చూశానని వికేంద్ర పోలీసులకు తెలిపాడు. అతడిని ఆపేందుకు ప్రయత్నించినా వినలేదని అన్నాడు. తాను ఎలుకను కాలువలో నుంచి తీసేసరికి అది ప్రాణాలు కోల్పోయిందని చెప్పాడు. ఈ క్రమంలోనే పోలీసులు కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 429తోపాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్​లో (ఐవీఆర్‌ఐ) ఎలుకకు శవపరీక్ష నిర్వహించగా.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్​ కారణంగా అది చనిపోయినట్లు తేలింది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్టు, వీడియోలు, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా.. నిందితుడు మనోజ్​ కుమార్​పై పోలీసులు ఛార్జ్​షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్విస్ట్ ఏంటంటే?
ఫిర్యాదుదారుడు ఆరోపించినట్లు ఎలుక మరణానికి కారణం నీటిలో మునిగిపోవడం కాదని పోస్టుమార్టం పరీక్ష నివేదికలు వెల్లడైంది. ఎలుక ఊపిరాడక చనిపోయిందని.. అప్పటికే అది అనారోగ్యంతో ఉందని తేలింది. నిందితుడు పెట్టిన చిత్రహింసల వల్ల చనిపోలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

"ఎలుక ఊపిరితిత్తుల్లో నీరు లేదు. కాలేయం, ఊపిరితిత్తులు అప్పటికే దెబ్బతిన్నాయి. ఎలుక అనారోగ్యంతో బాధపడుతుంది. ఊపిరితిత్తులలో నెక్రోసిస్ కారణంగా ఎలుక బహుశా మరణించి ఉండొచ్చు. అంతేకాకుండా.. హిస్టోపాథాలజీ, మైక్రోస్కోపీ పరీక్షలో కూడా ఎలుక శరీర గొట్టాలలో దేనిలోనూ నీరు లేదు.."

-- కేపీ సింగ్​, వైద్యుడు

ఎలుక పోయిందని ఫిర్యాదు..
తాను అల్లారుముద్దుగా పెంచుకున్న ఎలుకను ఎవరో ఎత్తుకెళ్లారని రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. అనంతరం అతడికి నచ్చజెప్పేందుకు వారు ప్రయత్నించారు పోలీసులు. తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని.. దానిని ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదుదారుడు పేర్కొనడం విశేషం. అక్కడితో ఆగకుండా తన సోదరుడి ముగ్గురు కుమారులపై అనుమానం ఉందని సైతం వెల్లడించాడు. చివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురి పేర్లను అందులో నిందితులుగా పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Apr 12, 2023, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.