Police Arrested Fake Finger Print Gang in Hyderabad : గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు.. వారి వారి ఖాతాల్లోని నగదు ఉపసంహరణలకు, డిపాజిట్లు, బదిలీలకు ప్రతిసారీ బ్యాంకుకు వెళ్లకుండా.. రూ.10,000ల లోపు నగదు ఉపసంహరణల కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది ఆర్‌బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అనుమతులతో పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దుకాణదారులు, ఇతర చిరు వ్యాపారులు వంటి అర్హులైన వారికి.. బ్యాంకులు మర్చంట్ ఐడీలను ఇస్తారు.
Hyderabad Police on Investment Frauds : 'క్లిక్ చేస్తే.. డబ్బులు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే'
వేలిముద్రల ఆధారంగా పథకానికి ప్లాన్ : మర్చంట్ ఐడీ ఉన్నవారికి.. ప్రజలు ఆధార్ కార్డు వివరాలు ఇస్తే.. వారి అనుసంధానంగా ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రంలో కనిపిస్తాయి. వాటిని ఎంపిక చేసుకుని రూ.10,000 లోపు అంటే.. రూ.9999 వరకూ నగదు ఉపసంహరణ లేదా ఇతర ఖాతాకు బదిలీ చేసుకునే వీలు ఉంటుంది. ఇందుకు వినియోగదారుడు వేలిముద్ర (Finger Print )వేయాల్సి ఉంటుంది. ఆధార్‌లో నిక్షిప్తమైన వేలిముద్రలు.. కస్టమర్ వేసిన ఈ వేలిముద్రలు సరిపోవాలి. అప్పుడే నగదు ఉపసంహరణ అవుతుంది. దీన్నే ఆసరాగా చేసుకుని నిందితులు ఈ పథకం వేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
గత నెలలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు (Hyderabad Cyber Crime Police).. ఫినో పేమెంట్స్ బ్యాంకు నుంచి ఓ ఫిర్యాదు అందింది. అందులో తమ కంపెనీ పేమెంట్ సేవలు చేసేందుకు ఆర్బీఐ, ఎన్‌పీసీఐ నుంచి అనుమతి పొందిందని తెలిపింది. కాగా తాము.. శ్రీను అనే వ్యక్తికి ఇచ్చిన మర్చంట్ ఐడీ ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి.. నెత్తిన కుచ్చుటోపీ పెట్టి..!
Finger Print Cloning Gang Arrested in Hyderabad : శ్రీను అనే మర్చంట్‌కి చెందిన బ్యాంకు ఖాతా వివరాలను.. పోలీసులు పరిశీలించారు. అందులో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ద్వారా పలు బ్యాంకు ఖాతాల నుంచి.. శ్రీను ఐడీకి అనుసంధానంగా ఉన్న ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేయగా విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. కొందు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్ మియాపూర్‌కి చెందిన అసాధారణ్ అలియాస్ రూపేశ్ ఇందుకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. అతనికి పరిచయం ఉన్న రఫీ, ఉదయ్‌కిరణ్, మహ్మద్ అయాజ్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారని పేర్కొన్నారు. ఏపీలోని నెల్లూరులో అసాధారణ్‌కు పరిచయం ఉన్న నరేంద్ర ద్వారా.. ప్రకాశం జిల్లా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన ఈ కేవైసీ డేటాను స్థానిక మీసేవాలో సేకరించాడని పోలీసులు వివరించారు.
ఇందుకుగాను నరేంద్ర ఒక్కో డేటాకి రూ.40 తీసుకుని.. దానిని పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి.. అసాధారణ్‌కి అప్పగించాడని చెప్పారు. ప్రధాన నిందితుడు.. వేలిముద్రలు, స్టాంపులు ముద్రించే యంత్రాన్ని, బయోమెట్రిక్ డివైజ్‌ను ఈ కామర్స్ సంస్థ ద్వారా తెప్పించుకున్నాడని వివరించారు. ఈ యంత్రం ద్వారా అసాధారణ్.. పెన్‌డ్రైవ్‌లోని వేలిముద్రలు తయారు చేశాడని తెలిపారు. ఇందుకు మహ్మద్ అయాజ్ అతడికి సహాయం చేశాడని పోలీసులు వెల్లడించారు
Cyber crime news : లాభాల పేరిట వల.. రెండు నెలల్లో రూ.300 కోట్ల మోసం
మర్చంట్ ఐడీని ఆధారంగా చేసుకొని : ఈ నేపథ్యంలోనే సేకరించిన వేలిముద్రలు వాటి ఖాతాల్లోని నగదును కాజేసేందుకు నిందితులు.. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ సులభమైన పని అని భావించారని పోలీసులు పేర్కొన్నారు. కానీ దానికి మర్చంట్ ఐడీ అవసరం ఉండటంతో.. అతనికి పరిచయం ఉన్న శివకృష్ణతో మర్చంట్ ఐడీలు సేకరించాలని అసాధారణ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుల ఖాతాల్లోకి నగదు బదిలీ : దీంతో శివకృష్ణ.. ఇందుకు అర్హులైన శ్రీను, తరుణ్ సహా పలువురి దగ్గర మర్చంట్ ఐడీలు తీసుకున్నారని పోలీసులు వివరించారు. ఇందుకు వారికి కమిషన్ ఇచ్చాడని చెప్పారు. ముందుగా వీరి మర్చంట్ ఐడీల ద్వారా లాగిన్ అయి.. ఆ తర్వాత వారు సృష్టించిన నకిలీ వేలిముద్రలతో సంబంధిత ఖాతాల్లోని నగదును.. నిందితులు వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారని వివరించారు. ఇలా మూడు రోజుల్లోనే ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 300 మంది ఖాతాల్లో నుంచి రూ.10 లక్షలు కాజేసినట్లు పోలీసులు తెలియజేశారు.
CYBER CRIME: 'అధిక ఆదాయం ఆశచూపి.. నిండా ముంచేశారు'
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆసాధారణ్ సహా ఉదయ్‌కిరణ్, అయాజ్, నరేంద్ర, శివకృష్ణ, శ్రీనులను.. అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారి నుంచి ఫింగర్ ప్రింట్ యంత్రం, 8 చరవాణులతో పాటు, బయోమెట్రిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Cyber crime news : లాభాల పేరిట వల.. రెండు నెలల్లో రూ.300 కోట్ల మోసం
Cyber Fruad: ఇదెక్కడి దొంగ తెలివిరా బాబు... సైబర్ నేరగాళ్ల కొత్త రూట్