ETV Bharat / bharat

మోదీ గడ్డంపై థరూర్ 'ఇంగ్లీష్​' సెటైర్! - పొగోనోట్రోఫీ పదం అర్థం

కాంగ్రెస్​ నేత శశిథరూర్​ 'పొగోనోట్రోఫీ' అనే పదం వాడి ట్విటర్లో హల్​చల్​ సృష్టించారు. ఈ పదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గడ్డానికి లంకె పెట్టారు.

Pogonotrophy
శశి థరూర్​ మోదీ గడ్డం
author img

By

Published : Jul 3, 2021, 5:40 AM IST

Updated : Jul 3, 2021, 6:57 AM IST

శశిథరూర్ ఆంగ్ల భాషా పరిజ్ఞానం గురించి తెలిసిందే. ఈ కేరళ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతుంటే నిఘంటువు వెతుక్కోవాల్సిందే. తాజాగా ఆయన 'పొగోనోట్రోఫీ'(Pogonotrophy) అనే పదం వాడి ట్విటర్లో హల్​చల్​ సృష్టించారు. ఈ పదంతో ప్రధాని మోదీ గడ్డానికి లంకె పెట్టారు. పొగోనోట్రోఫీ అంటే గడ్డం పెంచడం. కరోనా సమయంలో మోదీ కూడా పొగోనోట్రోఫీయే చేస్తున్నారంటూ థరూర్ వ్యంగ్యాస్త్రం విసిరారు.

ఓ కొత్త పదం నేర్పాలంటూ ట్విటర్లో ఓ వైద్యురాలు అడిగిన ప్రశ్నకు థరూర్ బదులిస్తూ.. "నా స్నేహితుడు, ఆర్థికవేత్త రతిరాయ్ ఈ రోజు నాకు ఓ కొత్త పదం నేర్పించారు. పొగోనోట్రోఫీ. అంటే గడ్డం పెంచడం. మహమ్మారి వేళ ప్రధానికి కూడా పొగోనోట్రోఫీ వ్యాపకంగా మారింది" అని ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి: Supreme Court: మంత్రి గురించి ప్రధాని చూసుకుంటారు!

ఇదీ చూడండి: గూగుల్​, ఫేస్​బుక్​కు థరూర్​ కమిటీ హెచ్చరిక!

Last Updated : Jul 3, 2021, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.