ETV Bharat / bharat

'మోదీ గడ్డం పెరిగింది తప్ప అభివృద్ధి లేదు' - మమతా బెనర్జీ బెంగాల్​ ఎన్నికలు

బంగాల్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. మోదీ గడ్డం పెరుగుతోంది కానీ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఈవీఎంలను ట్యాంపర్​ చేసేందుకు భాజపా ప్రయత్నిస్తుందని, అప్రమత్తంగా ఉండాలని తృణమూల్ శ్రేణులకు సూచించారు. ​

mamata banerjee on pm modi, మమతా బెనర్జీ బెంగాల్​ ఎన్నికలు
మమతా బెనర్జీ
author img

By

Published : Mar 26, 2021, 10:46 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ గడ్డం పెరుగుతోంది కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం అభివృద్ధి చెందట్లేదని ఎద్దేవా చేశారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. భాజపా దేశంలోని అతిపెద్ద మోసపూరిత పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ దేశాన్ని అమ్మేసి మోదీ పేరును పెట్టే రోజు త్వరలోనే రానుందని ద్వజమెత్తారు. పశ్చిమ మెద్నిపుర్​ జిల్లాలో పర్యటన సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

"భారత​ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. పారిశ్రామిక రంగంలో ఎలాంటి అభివృద్ధి లేదు. మొత్తంగా దేశంలో మోదీ గడ్డం పెరుగుదల తప్ప ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు. మోదీ వస్త్రధారణ ఓసారి రవీంద్రనాథ్​ ఠాగూర్​లా, మరోసారి మహాత్మ గాంధీలా ఉంటుంది. ఓట్ల కోసం భాజపా ఏమైనా చేస్తుంది. ఏప్రిల్​ 1 వరకు నేను నందిగ్రామ్​లోనే ఉంటాను. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి భాజపా గూండాలను రప్పించి ఓట్లను లూటీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో విదేశీయుడన్న కారణంతో బంగ్లాదేశీ నటుడు ఫెరోజ్​ను మా పార్టీ తరఫున ప్రచారం చేయకుండా వీసా నిరాకరించారు. మరి మోదీ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​ తరఫున ప్రచారం ఎలా నిర్వహించారు? 'ఆప్​ కీ బార్​ ట్రంప్​ సర్కార్​' నినాదం మీకు గుర్తుందా?"

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

అన్ని పార్టీలు ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావిడిలో ఉంటే భాజపా ప్రభుత్వం మాత్రం దిల్లీ ప్రభుత్వానికి ఉన్న రాజ్యాంగ అధికారాలకు కాల రాసేలా బిల్లులు ప్రవేశపెట్టిందన్నారు. ఇది సిగ్గుపడాల్సిన చర్య అన్నారు. ఈవీఎంలను భాజపా ట్యాంపర్​ చేసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తృణమూల్​ కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.

ఇదీ చదవండి : 'మహా'లో 36 వేల 902 కేసులు- 28 నుంచి రాత్రి కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.