ETV Bharat / bharat

'జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి'- పుతిన్​కు మోదీ సూచన - పుతిన్​తో మాట్లాడిన మోదీ

PM speaks to Putin: ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో ఫోన్​లో మాట్లాడారు. దాదాపు గంట సేపు ఉక్రెయిన్ అంశంపై చర్చించారు. సుమీలో చిక్కుకున్న భారతీయులను తీసుకుని వచ్చే అంశాన్ని మోదీ ప్రస్తావించగా.. పుతిన్​ సానుకూలంగా స్పందించారు.

PM speaks to Putin
పుతిన్​తో ఫోన్​లో మాట్లాడిన ప్రధాని మోదీ
author img

By

Published : Mar 7, 2022, 4:33 PM IST

PM speaks to Putin: ఉక్రెయిన్‌ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. 50 నిమిషాల పాటు ఈ సంభాషణ సాగింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సాగుతున్న సంప్రదింపుల వివరాలు ఈ సందర్భంగా మోదీకి పుతిన్‌ వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడాలని పుతిన్‌కు మోదీ సూచించినట్లు వెల్లడించాయి.

ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించడాన్ని మోదీ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశం తీసుకుచ్చే అంశాన్ని పుతిన్‌తో మోదీ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ సైనికుల మధ్య తీవ్రమైన పోరులో దాదాపు 700 మంది భారతీయ విద్యార్థులు సుమీలో చిక్కుకుపోయారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశం తరలించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మోదీకి పుతిన్‌ హామీ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సుమీతో సహా ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలలో కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకోవడంతో పాటు మానవతా కారిడార్‌ల ఏర్పాటు విషయంపై ప్రధాని మోదీ పుతిన్​కు అభినందనలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: ఉక్రెయిన్ నుంచి భారత్​కు 15,900 మంది.. వారికి కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.