ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా కరోనా టీకా వేయించుకోవాలని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ పేర్కొన్నారు. చాలా మంది వ్యాక్సిన్‌ను విశ్వసించడం లేదని, ఇలా చేస్తే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన.. ప్రధానితో పాటు, రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రులు సైతం బహిరంగంగా టీకా తీసుకోవాలని సూచించారు.
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులైన జో బైడెన్, కమలా హారిస్‌లు సైతం బహిరంగంగా కరోనా టీకా స్వీకరించారని దయానిధి మారన్ గుర్తు చేశారు.
"సమర్థతపై అనుమానంతో వ్యాక్సిన్‌ను ప్రజలు పూర్తిగా నమ్మడం లేదు. కాబట్టి ప్రధాని మోదీ బహిరంగంగా టీకా తీసుకోవాలి. మన ప్రధానికి అమెరికన్ విధానం ఇష్టం అనుకుంటా. బైడెన్, హారిస్ ఇప్పటికే టీకా తీసుకున్నారు. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ ఫిలిప్‌తో పాటు, మోదీ చిరకాల మిత్రుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం టీకా(బహిరంగంగా) తీసుకున్నారు."
-దయానిధి మారన్, డీఎంకే ఎంపీ
ఇదీ చదవండి: ట్విట్టర్‌కు పోటీగా 'కూ'తకొచ్చింది..!