Pariksha Pe Charcha 2022: 2022 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్ధులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చురుకైన యువతతో అనుసంధానం అయ్యేందుకు, విద్యా ప్రపంచంలో ఉద్భవిస్తున్న కొత్త అంశాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తోందని ప్రధాని ట్విట్టర్‌లో అన్నారు. ఒత్తిడి లేని పరీక్షల గురించి మాట్లాడుకుని ధైర్యవంతులైన పరీక్షా వీరులు సహా వారి తల్లిదండ్రులు, అధ్యాపకులకు మద్దతు తెలియజేద్దామని పేర్కొన్నారు. నేర్చుకునే విషయంలో.. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం వ్యక్తిగతంగా తనకు అద్భుతమైన అనుభవం అని ప్రధాని తెలిపారు.
విద్యార్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లను, వారి ఆకాంక్షలను మరింత ఉత్తమంగా అర్ధం చేసుకునే అవకాశం అని పేర్కొన్నారు. పరీక్షల పట్ల విద్యార్ధుల్లో భయాన్ని దూరం చేసేందుకు 2018 నుంచి ప్రధాని 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు.. అఖిలేశ్ కీలక ప్రకటన