కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఎక్కడా కనిపించట్లేదని దుయ్యబట్టారు. ఈ కష్టకాలంలో పరోపకారం చేస్తున్న ప్రతి ఒక్కరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.
"కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలోనే కాక ప్రజల పక్షాన నిలవడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. పరోపకారం చేస్తున్న వందలాది మంది కథలు ప్రతిరోజు వింటున్నాము. భారత్ అంటే ఏంటో వారు ప్రపంచానికి తెలుపుతున్నారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
పీఎం కేర్స్ వెంటిలేటర్లతో ప్రధానిని పోలుస్తూ రాహుల్ ఎద్దేవా చేశారు. అవసరమైన సమయంలో ఆ రెండూ పనిచేయడంలేదని అన్నారు. పీఎం కేర్స్ నిధుల నుంచి వచ్చిన వెంటిలేటర్లు పనిచేయట్లేదని పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలు ఇప్పటికే ఆరోపించిన నేపథ్యంలో గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: స్టాలిన్ సూపర్ రాజకీయం.. అన్నాడీఎంకే నేతకు చోటు