నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో శాససనభ ఎన్నికల పోలింగ్ జరగుతున్న వేళ.. ఓటర్లందరూ పెద్దఎత్తున పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం, కేరళ, తమిళనాడు, బంగాల్, పుదుచ్చేరిలో ఓటర్లు.. రికార్డుస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా.. యువత ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. బలమైన సంకల్పం, అవినీతి రహిత ప్రభుత్వం మాత్రమే అభివృద్ధిని సాధించగలదని.. దాన్ని ఎన్నుకునేందుకు ఓటింగ్‌లో పాల్గొనాలని ట్వీట్ చేశారు షా.
ఈ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: ఓటేసిన కమల్-రజనీ