ETV Bharat / bharat

ఈ నెల 27న డిజిటల్​ హెల్త్​ మిషన్​ ప్రారంభం

author img

By

Published : Sep 23, 2021, 4:42 PM IST

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ఈనెల 27న డిజిటల్ హెల్త్ మిషన్‌ను (పీఎండీహెచ్​ఎం)(digital health mission) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news latest) ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవియా తెలిపారు.

PM Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ

దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి డిజిటల్​ హెల్త్​ మిషన్​ను(పీఎం-డీహెచ్​ఎం)(digital health mission) ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi news latest) ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి ప్రత్యేక నంబర్​తో(హెల్త్ ఐడీ)(digital health mission in India) వైద్య కార్డు అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా వెల్లడించారు.

ఏంటీ ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్?

  • టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించే కార్యక్రమం.
  • దీని కింద ప్రతి భారతీయుడికి హెల్త్​ ఐడీ కేటాయిస్తారు.
  • హెల్త్ ఐడీ ఆధారంగా ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.

హెల్త్ ఐడీ అంటే?

  • ప్రతి ఒక్కరికీ ఆధార్​ తరహాలో ఇచ్చే విశిష్ట సంఖ్యే హెల్త్​ ఐడీ.
  • ఈ నెంబర్ ద్వారా వారి ఆరోగ్య రికార్డులు నమోదు చేస్తారు.
  • వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది.
  • ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ ఆధారంగా ఆరోగ్య సమాచారాన్ని అక్కడి వైద్యులు పరిశీలించేందుకు వీలు కలుగుతుంది.

ఏ సమాచారం నిక్షిప్తమవుతుంది?

  • మనం చేయించుకున్న వైద్య పరీక్షల వివరాలు.
  • ఇదివరకు వైద్యులు సూచించిన మందులు.
  • గతంలో ఏం చికిత్స తీసుకున్నారనే విషయాలు.
  • ఆ వ్యక్తికి వర్తించే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, బీమా వివరాలూ ఉండే అవకాశం.

ఉపయోగాలు ఏంటి?

  • దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
  • మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్‌, ఈ- ఫార్మసీలు సేవలు అందుతాయి.
  • ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలుగుతుంది.

డిజిటల్ హెల్త్ మిషన్​ అమలు ఎలా?

ఈ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుంది. ఆ పథకం విధివిధానాలకు అనుగుణంగానే ఎన్​డీహెచ్​ఎం అమలవుతుంది.

మన సమాచారానికి భద్రత ఉంటుందా?

  • వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్‌ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంది.

2020 ఆగస్టు 15న నేషనల్​ డిజిటల్ హెల్త్ మిషన్​(ఎన్​డీహెచ్​ఎం)(national digital health mission) పేరుతో ప్రారంభించిన కార్యక్రమాన్నే.. పీఎం-డీహెచ్​ఎంగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: PM CARES Fund: 'పీఎం కేర్స్​ ఫండ్​ ప్రభుత్వ నిధి కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.