PM Narendra Modi Telangana Tour : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన హకీంపేట విమానశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మామునూరుకు చేరుకున్నారు. మామునూరు నుంచి రోడ్డుమార్గాన భద్రకాళి ఆలయానికి వెళ్లారు. అక్కడ.... అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గోశాలలో గో సేవలో మోదీ పాల్గొన్నారు.
గోసేవ అనంతరం భద్రకాళీ అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మోదీకి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా భద్రకాళి ఆలయం చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు. భద్రకాళి అమ్మవారికి పూజలు అనంతరం.. ప్రధాని నేరుగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. గా మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం అక్కడి నుంచి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి మోదీ చేరుకుని.... వర్చువల్ విధానంలో రూ.521 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ఈ క్రమంలోనే రూ.2,147 కోట్ల రూపాయల వ్యయంతో... జగిత్యాల-కరీంనగర్-వరంగల్ ఇంటర్ కారిడార్‌కు, రూ.3,441 కోట్ల వ్యయంతో ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మైదానంలో విజయ్ సంకల్ప బహిరంగసభలో పాల్గొంటారు.
PM Modi Warangal Tour : మరోవైపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అడగడుగున్న తనిఖీలను విస్తృతం చేశారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్,ఎస్పీజీ, సివిల్ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటించే మార్గాల్లో మూడంచెల భద్రతను కల్పించారు. స్థానిక పోలీసులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు మూడున్నర వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
PM Modi Visits Telangana : ఈ క్రమంలోనే 29 వాహనాలతో భారీ కాన్వాయ్ సిద్ధం చేశారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అదనంగా ఉంటాయి. వరంగల్ , హనుమకొండ, కాజీపేట ట్రై సిటీల పరిధిలో 20 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ వరంగల్ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓరుగల్లు పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 12:55 గంటలకు మామునూరు నుంచి సికింద్రాబాద్ హకీంపేట్‌కు చేరుకొని.. అక్కడి నుంచి రాజస్థాన్ బయలుదేరి వెళ్లనున్నారు.
ఇవీ చదవండి: