ETV Bharat / bharat

పెట్టుబడి సాయం విడుదల- రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి తొమ్మిదో విడత నిధులను విడుదల చేశారు మోదీ. పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. దేశంలో వ్యవసాయానికి కొత్త దిశలను అందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మోదీ. దాని ద్వారా కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ.. కొత్త అవకాశాల ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

PM Narendra Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Aug 9, 2021, 1:23 PM IST

Updated : Aug 9, 2021, 2:02 PM IST

రైతులకు ప్రతి ఏటా అందించే పెట్టుబడి సాయం ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 9వ విడత నిధులను వర్చువల్​గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. పీఎం కీసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.19,509 కోట్లు జమయ్యాయి.

" ఈ ఏడాది దేశం 75వ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఈ ముఖ్యమైన మైలురాయి మనకు గర్వకారణమే కాదు.. కొత్త నిర్ణయాలు, లక్ష్యాలను నిర్దేశించుకునే కార్యక్రమం. వచ్చే 25 ఏళ్లలో భారత్​ ఏ స్థాయిలో ఉండాలో ఈ కార్యక్రమం వేదికగా మనం నిర్ణయం తీసుకోవాలి. 2047లో వందేళ్ల స్వతంత్ర దినోత్సవం నాటికి వ్యవసాయంలో భారత్​ ఏ పరిస్థితిలో ఉండాలి? దానిని నిర్ణయించటంలో గ్రామాలు, రైతులు కీలక పాత్ర పోషిస్తారు. వ్యవసాయానికి కొత్త దిశలను అందించాల్సిన సమయం ఇది. అది కొత్త సవాళ్లను ఎదుర్కోగలదు. కొత్త అవకాశాలను నుంచి లబ్ధి పొందుతుంది.

కరోనా మహమ్మారి సమయంలోనూ మన రైతుల సామర్థ్యాన్ని చూశాం. రికార్డు స్థాయిలో పంట దిగుబడుల నేపథ్యంలో రైతులకు ఎదురయ్యే సవాళ్లను తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. విత్తనాలు, ఎరువులు అందించటం నుంచి మార్కెట్లకు తమ పంటను తీసుకెళ్లే వరకు ప్రభుత్వం అండగా నిలిచింది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

పీఎం కిసాన్‌ పథకం కింద రైతు కుటుంబాలకు ఏడాదికి 6 వేలను మూడు వాయిదాల్లో కేంద్రం అందిస్తోంది. 4 నెలలకు ఒకసారి 2 వేల చొప్పున విడుదల చేసే సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. కిసాన్ సమ్మాన్‌ నిధి కింద ఇప్పటి వరకూ 1.38 లక్షల కోట్లను రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం తెలిపింది. మే14న 8వ పీఎం కిసాన్ నిధులను ప్రధాని విడుదల చేశారు.

ఇదీ చూడండి: ''క్విట్ ఇండియా'తో వలసవాదంపై పోరు బలోపేతం'

Last Updated : Aug 9, 2021, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.