నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0(swachh bharat mission urban) లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-2.0, అమృత్ 2.0 కార్యక్రమాలను(swachh bharat mission 2.0) ప్రారంభించారు. పట్టణ ప్రాంత ప్రజలకు చెత్త నుంచి విముక్తితో పాటు తాగునీటి భద్రత కల్పించమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు మోదీ పేర్కొన్నారు. పట్టణాల్లో కొండలా పేరుకు పోయిన చెత్తను ప్రాసెస్ చేసి.. పూర్తిగా తొలగించే ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. భారత్ ప్రస్తుతం లక్ష టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తోందన్నారు. పరిశుభ్రత.. ఒక రోజో, వారానికో లేదా సంవత్సరానికో సంబంధించినది కాదని.. ప్రతిఒక్కరూ రోజూ పాల్గొనాల్సిన మెగా క్యాంపెయిన్ అని ప్రధాని(swachh bharat mission modi) అన్నారు.
"నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్-2.0 లక్ష్యం. పట్టణాల్లో కొండలా పేరుకు పోయిన చెత్తను ప్రాసెస్ చేసి పూర్తిగా తొలగించే ఏర్పాట్లు చేస్తాం. భారత్‌లో ప్రస్తుతం లక్ష టన్నుల చెత్తను ప్రాసెసింగ్ జరుగుతోంది. 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినపుడు రోజువారీ చెత్తలో 20శాతం లోపే ప్రాసెస్ చేసేవారు, ఇప్పుడు అది 70 శాతానికి చేరుకుంది. దీనిని 100 శాతానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. రెండో దశ స్వచ్ఛ భారత్, అమృత్ కార్యక్రమాలు రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ కలలను నిజం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి. సమానత్వానికి పట్టణాభివృద్ధి మూల స్తంభం అని అంబేద్కర్ విశ్వసించేవారు."
- ప్రధాని నరేంద్ర మోదీ
వేగంగా జరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవడం, 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం వీటిని రూపొందించింది. స్వచ్ఛ భారత్ (పట్టణ)(swachh bharat mission urban) కింద పట్టణాలకు మురుగు నుంచి విముక్తి కల్పిస్తారు. అమృత్ పథకం పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో మురికి నీటి నిర్వహణ చేపడతారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ ప్లస్ (బహిరంగ మల విసర్జన రహితం)గా మారుస్తారు. లక్ష జనాభాకు పైబడిన పట్టణాలను ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్‌గా తీర్చిదిద్దుతారు. తద్వారా పట్టణాలు స్వచ్ఛమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఘన వ్యర్థాలను అవి ఉత్పత్తి అయ్యేచోటే వేరు చేయడంపై దృష్టి సారిస్తారు. వాటిని తగ్గించడం, పునర్వినియోగించడం, పునఃశుద్ధి చేయడం గురించి ఆలోచిస్తారు. మున్సిపాల్టీల్లో వెలువడే అన్నిరకాల వ్యర్థాలను శుద్ధిచేసి, వాటిని సమర్థవంతంగా తిరిగి వినియోగిస్తారు.
ఇదీ చూడండి: PM Poshan Scheme: పేరు మారాక.. లక్ష్యం చేరేనా?