ETV Bharat / bharat

ఆగ్రా మెట్రో ప్రాజెక్టు పనులకు మోదీ శ్రీకారం

రూ. 8,380 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆగ్రా మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూపీలో ప్రధాన పర్యటక కేంద్రాలైన తాజ్​మహల్​, ఆగ్రా కోట, సికంద్రాలను రైల్వే స్టేషన్లు, బస్​ స్టేషన్లకు అనుసంధానించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతోంది యూపీ ప్రభుత్వం.

PM Narendra Modi inaugurates the construction work of Agra Metro Project via video conferencing
ఆగ్రా మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభించిన మోదీ
author img

By

Published : Dec 7, 2020, 12:25 PM IST

Updated : Dec 7, 2020, 12:37 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ఆగ్రాలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణ పనులను వర్చువల్​గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగ్రాలోని 15వ బెటాలియన్​ పీఏసీ పరేడ్ గ్రౌండ్​లో జరిగిన ప్రారంభోత్సవంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరి, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పాల్గొన్నారు.

రెండు కారిడార్లు, 29.4 కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. యూపీలో ప్రధాన పర్యటక కేంద్రాలైన తాజ్​మహల్​, ఆగ్రా కోట, సికంద్రాలను రైల్వే స్టేషన్లు, బస్​ స్టేషన్లకు అనుసంధానించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతోంది యూపీ ప్రభుత్వం. దీని ద్వారా ఆగ్రాలోని 26 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఏటా నగరానికి వచ్చే 60 లక్షల మంది పర్యటకులకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.

రూ.8,380 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఆగ్రా మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు.

Last Updated : Dec 7, 2020, 12:37 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.