భారత ప్రధాని నరేంద్ర మోదీని(PM Modi) 66 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని ప్రపంచ నాయకులపై సర్వేలు నిర్వహించే మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తెలిపింది. 2019 ఆగస్టులో మోదీని 82శాతం మంది ఆమోదించగా.. ఇప్పుడది సుమారు 20పాయింట్లు తగ్గింది. అయినా ఇతర ప్రపంచ నాయకులకంటే ప్రజామోదం ఉన్ననేతగా మోదీనే ముందున్నారు.
-
Global Leader Approval: Among All Adults https://t.co/dQsNxouZWb
— Morning Consult (@MorningConsult) June 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Modi: 66%
Draghi: 65%
López Obrador: 63%
Morrison: 54%
Merkel: 53%
Biden: 53%
Trudeau: 48%
Johnson: 44%
Moon: 37%
Sánchez: 36%
Bolsonaro: 35%
Macron: 35%
Suga: 29%
*Updated 6/17/21 pic.twitter.com/FvCSODtIxa
">Global Leader Approval: Among All Adults https://t.co/dQsNxouZWb
— Morning Consult (@MorningConsult) June 17, 2021
Modi: 66%
Draghi: 65%
López Obrador: 63%
Morrison: 54%
Merkel: 53%
Biden: 53%
Trudeau: 48%
Johnson: 44%
Moon: 37%
Sánchez: 36%
Bolsonaro: 35%
Macron: 35%
Suga: 29%
*Updated 6/17/21 pic.twitter.com/FvCSODtIxaGlobal Leader Approval: Among All Adults https://t.co/dQsNxouZWb
— Morning Consult (@MorningConsult) June 17, 2021
Modi: 66%
Draghi: 65%
López Obrador: 63%
Morrison: 54%
Merkel: 53%
Biden: 53%
Trudeau: 48%
Johnson: 44%
Moon: 37%
Sánchez: 36%
Bolsonaro: 35%
Macron: 35%
Suga: 29%
*Updated 6/17/21 pic.twitter.com/FvCSODtIxa
అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు మోదీ ఆమోద రేటింగ్ 82 శాతంగా ఉందని మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. కేవలం 11 శాతం మంది మాత్రమే ఆయన్ను వ్యతిరేకించారు. ఈ జూన్‌నాటికి ఆ రేటింగ్ 66 శాతానికి పడిపోగా.. 28శాతం మంది నిరాకరించారు. 2 వేల126 మంది వయోజనులపై ఈ సర్వే నిర్వహించారు.
రేటింగ్ పరంగా అమెరికా, యూకే, రష్యా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ సహా 13 దేశాల ప్రపంచ స్థాయి నేతల కంటే మోదీనే ముందున్నారని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ రేటింగ్ 53 శాతంగా ఉంది. ఈ 13 దేశాల్లో జపాన్ ప్రధాని యొషిహిడే సుగా రేటింగ్ కేవలం 29 శాతంగా మాత్రమే ఉంది.
ఇదీ చదవండి:Skill training: క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్- లక్ష మందికి శిక్షణ!