ETV Bharat / bharat

ప్రపంచ శాంతిని నెలకొల్పే స్థాయికి భారత్​ చేరాలి: మోదీ

PM modi yuva shivir: ప్రపంచ శాంతిని నెలకొల్పే స్థాయికి భారత్​ను చేర్చాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయంగా అస్థిరత ఏర్పడినా శాంతియుత దేశంగా భారత్​ నిలిచిందని పేర్కొన్నారు.

్
author img

By

Published : May 19, 2022, 12:38 PM IST

PM modi yuva shivir: అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రపంచ శాంతిని నెలకొల్పే సామర్థ్యం గల దేశంగా భారత్​ను తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 'కరోనా ఉద్ధృతి సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు, మందులు పంపిణీ చేసిన దగ్గర నుంచి అంతర్జాతీయంగా అస్థిరత ఏర్పడినా శాంతియుత దేశంగా భారత్​ నిలిచింది. ప్రపంచానికి భారత్​ ఇప్పుడు కొత్త ఆశాకిరణం' అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్​లోని వడోదరాలో నిర్వహించిన యువ శిబిర్​ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కుందాల్​ధామ్, కరేయ్​బాగ్​ ప్రాంతాల్లోని శ్రీస్వామినారాయణ్​ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మోదీ వర్చువల్​గా హాజరయ్యారు. పురాతన సంస్కృతిని, ఆధునిక ఆలోచనలను జోడించి నవభారత్​ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు మోదీ. 'ఏ సమాజానికి అయినా పునాది, అభివృద్ధి అందులో ఉండే యువతపైనే ఆధారపడి ఉంటుందని మన పూర్వికులు నేర్పించారు' అని ప్రధాని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'మూడోసారీ నేనే ప్రధాని'... క్లారిటీ ఇచ్చిన మోదీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.