ETV Bharat / bharat

'ఈయూ సదస్సుకు మోదీ హాజరు వర్చువల్​గానే' - france tour of modi

వచ్చే నెలలో జరగనున్న భారత్​-ఈయూ సదస్సుకు హాజరయ్యేందుకు నిర్ణయించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పర్యటన రద్దు అయింది. కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. వర్చువల్​ పద్ధతిలో ఈ సదస్సును నిర్వహించాలని ఈయూ-పోర్చుగీస్​ నాయకత్వాన్ని భారత్ కోరింది. ​

pm narendra modi
ప్రధాని.. పోర్చుగల్ పర్యటన రద్దు
author img

By

Published : Apr 20, 2021, 7:49 PM IST

Updated : Apr 21, 2021, 9:14 AM IST

కొవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న భారత్​-ఈయూ సదస్సు కోసం పోర్చుగల్​కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్లటం లేదు. ఈ సదస్సు వర్చువల్​గా జరగుతుందని అధికారులు తెలిపారు. ఈయూ(ఐరోపా సమాఖ్య), పోర్చుగీస్​ నాయకత్వాన్ని సంప్రదించిన అనంతరం.. మే 8న జరిగే ఈ సదస్సును వర్చువల్​ పద్ధతిలో నిర్వహించేందుకు అంగీకరించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

"కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందున భారత్​-ఈయూ సదస్సును వర్చువల్​గా నిర్వహించాలని ఈయూ, పోర్చుగల్​ అధికారులను సంప్రదించగా.. వారు అందుకు అంగీకరించారు."

- అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి

వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈయూలోని 27 దేశాల నేతలతో భారత్​-ఈయూ సదస్సు జరగనుందని అరిందమ్​ బాగ్చి తెలిపారు. ఈ సదస్సులో భాగంగా.. ఫ్రాన్స్​లో మోదీ పర్యటించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఇదీ చూడండి: కరోనా దృష్ట్యా యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

ఇదీ చూడండి: నిలకడగా మన్మోహన్​ ఆరోగ్యం- ప్రముఖుల ఆరా

Last Updated : Apr 21, 2021, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.