ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన సాగనుంది.
ఈ నెల 23 లేదా 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈ నెల 25న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని పాల్గొని కరోనా, తీవ్రవాదంపై ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అఫ్గానిస్థాన్‌పై భారత వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకురావాల్సిన సంస్కరణలను ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇక ఈ పర్యటన చేపడితే కరోనా తర్వాత ప్రధాని మోదీకి ఇది రెండొవ విదేశీ పర్యటన అవుతుంది. అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం బైడెన్‌తో మొదటి వ్యక్తిగత సమావేశం కానుంది. బైడెన్‌తో పాటు.. క్వాడ్, జీ-7 దేశాధినేతలను మోదీ కలవనున్నారు.
మోదీ చివరిసారిగా 2019లో అమెరికాను సందర్శించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇదీ చూడండి: Modi Meeting: కరోనా, వ్యాక్సినేషన్‌పై మోదీ కీలక సమావేశం