ETV Bharat / bharat

భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ - భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ

Modi meets BJP-ruled states CMs: తన సొంత నియోజకవర్గం వారణాసిలో రెండోరోజు పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. భాజపా పాలిత రాష్ట్రాల సీఎంతో సమావేశమయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 'సుపరిపాలన'పై సెమినార్‌ నిర్వహించారు.

PM Modi meeting with CMs of BJP-ruled states
భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ
author img

By

Published : Dec 14, 2021, 12:11 PM IST

Modi meets BJP-ruled states CMs: రెండోరోజు ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 'సుపరిపాలన'పై సెమినార్‌ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్​ పరిస్థితులు, సమస్యలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, భవిష్యత్​ కార్యచరణ సహా మరిన్ని అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. సోమవారం.. వారణాసిలో సీఎంలు, ఉపముఖ్యమంత్రులతో సమావేశమైన ప్రధాని.. మరుసటి రోజే ఈ సమావేశం నిర్వహించారు.

PM Modi meeting with CMs of BJP-ruled states
భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ

రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. పర్యటనలో భాగంగా మహామందిర్‌ ధామ్‌ను సందర్శించనున్నారు.

తొలిరోజు.. గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు ప్రధాని. ఆ తర్వాత వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథుని నడవా తొలి దశను ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. సాయంత్రం బ్యాటరీ పడవలో విహరిస్తూ నదీ తీరంలో హారతిని వీక్షించారు.

ఇదీ చూడండి: వారణాసిలో మోదీ బిజీబిజీ- అర్ధరాత్రి వేళ కూడా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.