సరసమైన ధరలకు జనౌషధి కేంద్రాల్లోమందులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. షిల్లాంగ్లో జనౌషధి దినోత్సవ వేడుకల్లో వర్చువల్గా పాల్గొన్న ఆయన.. 'ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన' పథక లబ్ధిదారులతో మాట్లాడారు.
"ఔషధాలు చాలా ఖరీదైనవి. అందుకే మేం పేదల కోసం జనౌషధి పథకాన్ని తీసుకువచ్చాం.పేదలు తక్కువ ధరకు మందులను కొనగోలు చేయడం ద్వారా రూ.9,000 కోట్లను ఆదా చేయగలిగారు. ఖరీదైన ఖర్చుల కారణంగా ఔషధాలను కొనలేని వారు ఇప్పుడు వీటి ద్వారా లబ్ధిపొందుతున్నారు. సరసమైన ధరలకే ఈ కేంద్రాల్లో ఔషధాలను కొనుగోలు చేయాలని నేను ప్రజలను కోరుతున్నాను. వీటిని 'మోదీ దుకాణం' అని ప్రజలు పిలుస్తున్నారు. మోదీ దుకాణంలోనే మందులు కొనుగోలు చేయండి."
-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
అంతకుముందు ఎన్ఈఐజీఆర్ఐహెచ్ఎంఎస్(నార్త్ ఈస్ట్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్) వద్ద 7,500వ జనౌషధి కేంద్రాన్ని వర్చుల్గా మోదీ ప్రారంభించి.. జాతికి అంకితం ఇచ్చారు.
ఇదీ చూడండి:బంగాల్ దంగల్: మోదీ సభకు సర్వం సిద్ధం