ETV Bharat / bharat

యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు- 10 రోజుల్లో నాలుగు టూర్లు! - Uttar Pradesh assembly elections

Modi UP Visit: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్​ప్రదేశ్​లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవలే కాశీ విశ్వనాథ్​ నడవా ప్రారంభోత్సవం కోసం అక్కడికి వెళ్లిన ప్రధాని.. వచ్చే 10 రోజుల్లో మరో నాలుగు సార్లు యూపీ వెళ్లనున్నారు.

Modi to Visit UP
Modi to Visit UP, మోదీ ఉత్తర్​ప్రదేశ్​
author img

By

Published : Dec 16, 2021, 3:20 PM IST

Modi UP Visit: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటించనున్నారు. రానున్న 10 రోజుల్లో మొత్తం నాలుగు సార్లు వేర్వేరు చోట్ల వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఇవి డిసెంబర్​ 18-28 మధ్య ఉండనున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు.

మోదీ షెడ్యూల్​ ఇదే..

Ganga Expressway Project

  • 18న షాజహాన్​పుర్​లో గంగా ఎక్స్​ప్రెస్​వేకు శంకుస్థాపన.

దీని పొడవు 594 కి.మీ.

ఈ ఎక్స్​ప్రెస్​వే కోసం రూ. 36 వేల 200 కోట్లు వెచ్చించనున్నారు.

ఐఏఎఫ్​ విమానాల అత్యవసర ల్యాండింగ్​, టేకాఫ్​ కోసం 3.5 కి.మీ. పొడవైన ఎయిర్​స్ట్రిప్​ను.. ఈ ఎక్స్​ప్రెస్​వేలో నిర్మించనున్నారు.

  • డిసెంబర్​ 21న ప్రయాగ్​రాజ్​లో.. 2 లక్షల మంది మహిళా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం.
  • డిసెంబర్​ 23న తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో మరోసారి పర్యటన.
  • ఈ నెల 28న కాన్పుర్​లో పర్యటించి మెట్రో ప్రారంభించనున్న మోదీ

వీడియో కాన్ఫరెన్స్​లో..

PM Narendra Modi to address mayors conference

మోదీ.. యూపీ పర్యటనకు ముందు వారణాసిలో జరిగే ఓ కార్యక్రమానికి వర్చువల్​గా హాజరుకానున్నారు. డిసెంబర్​ 17న వారణాసిలో జరగనున్న అఖిల భారత మేయర్ల సదస్సును ప్రారంభించి ప్రసగించనున్నారు.

'న్యూ అర్బన్​ ఇండియా' థీమ్​తో జరగనున్న ఈ కాన్ఫరెన్స్​లో వివిధ రాష్ట్రాలకు చెందిన మేయర్లు పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Modi in Varanasi

ఉత్తర్​ప్రదేశ్​లో రెండు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్​ 13న కాశీ విశ్వనాథ్​ కారిడార్​​ ప్రాజెక్టును ప్రారంభించారు ప్రధానమంత్రి. అంతకుముందు వారణాసిలో క్షణం తీరిక లేకుండా గడిపారు మోదీ.

తొలుత కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత కాషాయ దుస్తులు ధరించి గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. కాశీ విశ్వనాథ్​ నడవాను ప్రారంభించారు.

సోమవారం అర్ధరాత్రి కూడా వారణాసిలో అభివృద్ధి పనులను పరిశీలించారు మోదీ. బనారస్(వారణాసి) రైల్వే స్టేషన్​ను ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​తో కలిసి సందర్శించారు.

Kashi Vishwanath Corridor

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ పనులకు 2019 మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కాశీ ఆలయ సమీపంలోని భవనాలను కూల్చివేసి రహదారులను విస్తరించారు. టెంపుల్‌ చౌక్‌, వారణాసి సిటీ గ్యాలరీ, ప్రదర్శన శాల, బహుళ రీతిలో ఉపయోగించుకునే ఆడిటోరియాలు, హాళ్లు, ధ్యాన మందిరం, భక్తులు, అర్చకుల బస కేంద్రాలు, ఆధ్యాత్మిక పుస్తక కేంద్రాన్ని నిర్మించారు.

ఇవీ చూడండి: Modi: 'వెళ్లండయ్యా.. వెళ్లి కాశీ చూసి రండి.. ఎంతో అభివృద్ధి చేశాం'

వారణాసి పర్యటనలో మోదీ ఎన్ని దుస్తులు మార్చారంటే?

'కాశీ కారిడార్.. దేశ సనాతన సంస్కృతికి ప్రతీక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.