ETV Bharat / bharat

ఈనెల 29న ఇటలీకి మోదీ- జీ20 సదస్సుకు హాజరు

జీ-20 సదస్సులో(G20 Summit 2021) పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటలీకి(Modi Italy Visit) వెళ్లనున్నారు. అక్కడి నుంచి గ్లాస్​గౌలో(Glasgow Summit) జరిగే కాప్​-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్​కు వెళ్లనున్నారు. అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకు ఈ పర్యటన కొనసాగనుంది.

moid italy visit
ఇటలీలో మోదీ పర్యటన
author img

By

Published : Oct 24, 2021, 4:17 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 29 నుంచి నవంబరు 2 వరకు ఇటలీ(Modi Italy Visit), బ్రిటన్​లలో పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit 2021) , ప్రపంచ నేతల కాప్​-26 సదస్సులో(Glasgow Summit) ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ సహా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది.

16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్​లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో(Modi Italy Visit) పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

ఇటలీ నుంచి మోదీ.. గ్లాస్​గౌలో జరిగే కాప్​-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్​కు వెళ్లనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బ్రిటన్​ ప్రధాని బోరీస్ జాన్సన్​.. మోదీని ఆహ్వానించారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే 'ప్రపంచ నేతల సదస్సు' నవంబరు 1-2 మధ్య జరగనుంది. ఇందులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ఇటలీ, బ్రిటన్ అధ్యక్షత వహించనున్నాయి. 120పైగా దేశాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనున్నారు.

ఇదీ చూడండి: 'యువత భాగస్వామ్యంతోనే కశ్మీర్​లో ఉగ్రవాదానికి అడ్డుకట్ట'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.