ETV Bharat / bharat

'జీ20' కోసం ఇటలీకి మోదీ- పోప్​ ఫ్రాన్సిస్​తోనూ భేటీ! - జీ20 మోదీ

జీ20 సదస్సు (G20 Summit 2021) కోసం ఇటలీ పర్యటనకు వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news).. పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇటలీ ప్రధానితో చర్చలు జరపనున్నారు. క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్​ను మోదీ (Modi Pope Francis) కలవనున్నట్లు తెలుస్తోంది.

modi italy visit 2021
మోదీ ఇటలీ పర్యటన
author img

By

Published : Oct 28, 2021, 5:15 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇటలీ పర్యటనకు (Modi Italy visit 2021) వెళ్లనున్నారు. అక్టోబర్ 29-31 తేదీల్లో ఆయన రోమ్​లో పర్యటిస్తారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి ఆహ్వానం మేరకు జీ20 సదస్సుకు హాజరవుతారు. దీంతో పాటు పలు ద్వైపాక్షిక కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ (PM Modi news) పాల్గొననున్నారు.

రోమ్​కు చేరుకోగానే (Modi Italy visit 2021) మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న పియాజా గాంధీ ప్రాంతానికి మోదీ వెళ్లనున్నారు. అక్కడ మహాత్ముడికి నివాళులు అర్పిస్తారు. ప్రధానితో పాటు ఇటలీలోని భారత రాయబారి నీనా మల్హోత్రా అక్కడికి వెళ్తారు. రోమ్ మేయర్ రాబర్టో గువాల్టిరీ సైతం పియాజా గాంధీ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది.

PM ITALY
ఇటలీలోని మహాత్ముడి విగ్రహం

జీ20లో అఫ్గాన్​పై చర్చ!

అక్టోబర్ 30-31 తేదీల్లో జరగనున్న జీ20 సమావేశంలో (G20 Summit 2021) మోదీ పాల్గొంటారు. ఇటలీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాన్ని.. పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. జీ20 సభ్యదేశాలు, ఇతర ఆహ్వానిత దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. జీ20 సదస్సులో అఫ్గానిస్థాన్​లో పరిస్థితులపై మోదీ ప్రత్యేకంగా మాట్లాడతారని తెలుస్తోంది. అఫ్గాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంయుక్త చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చే అవకాశం ఉంది.

పర్యటనలో (Modi Italy visit 2021) భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు మోదీ. వీటితో పాటు మరికొన్ని ద్వైపాక్షిక భేటీలు నిర్వహిస్తారు. జీ20 సమావేశం అనంతరం గ్లాస్గోలో జరగనున్న కాప్26 వరల్డ్ లీడర్స్ సమిట్​లో పాల్గొంటారు.

పోప్ ఫ్రాన్సిస్​తో భేటీ!

ఇటలీ పర్యటన రెండో రోజు క్రైస్తవ మతగురువు పోప్​ ఫ్రాన్సిస్​తో ప్రధాని భేటీ (Modi Pope Francis) అవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ... వాటికన్ సిటీకి వెళ్లి ఆయన్ను కలుస్తారని సమాచారం. పోప్​తో సమావేశం ఏ విధమైనదనే విషయంపై అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, ఇరు దేశాల మధ్య ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా భేటీ ఉంటుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'ఆసియాన్​ దేశాలతో స్నేహమే భారత్​కు ప్రధానం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.