ETV Bharat / bharat

ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికే టీకా - narendra modi news latest

శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రం మోదీ ప్రారంభిస్తారని కేంద్రం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఆయన వర్చువల్​గా హజరవుతారని పేర్కొంది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది.

PM Modi to launch COVID-19 vaccination drive on January 16
కరోనా అంతానికి ఉదయం 10:30 గంటలకు ముహూర్తం
author img

By

Published : Jan 15, 2021, 5:24 AM IST

Updated : Jan 15, 2021, 6:08 AM IST

కరోనా వైరస్‌ నిరోధానికి దేశ వ్యాప్తంగా ఈ నెల 16నుంచి కొవిడ్ టీకా పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10.30గంటలకు వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభిస్తారని కేంద్రం వెల్లడించింది. తొలి రోజు 3లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా 3006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని, ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకా అందించనున్నట్టు స్పష్టంచేసింది. తొలి దశలో ప్రభుత్వ/ప్రయివేటు రంగంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. కొ-విన్‌ యాప్‌ ద్వారా టీకా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఎక్కడ ఎంత వ్యాక్సిన్‌ నిల్వ ఉంది? ఇంకా ఎన్ని డోసులు అవసరం.. తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోనే అధికారులు తెలుసుకోనున్నారు.

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తిచేసేందుకు వీలుగా 24×7 పనిచేసే ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1075 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితిని బట్టి ఈ టీకా పంపిణీ కేంద్రాలను 5వేలకు పైగా పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదీ చూడండి: ఈనెల 19న సుప్రీం 'కమిటీ' తొలి సమావేశం

Last Updated : Jan 15, 2021, 6:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.