వాతావరణ మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీని ఉపయోగించి పంటసాగు చేసేలా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news).. 35 పంట రకాలను(Latest Crop varieties) మంగళవారం జాతికి అంకితమివ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.
అయితే.. 35 సరికొత్త పంటరకాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) అభివృద్ధి చేసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 35 వెరైటీ వంగడాలను ఐసీఏఆర్ తయారు చేసినట్లు తెలిపింది.
వర్చువల్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా.. రాయ్‌పుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ నూతన భవనాన్ని మోదీ(Modi latest news) ప్రారభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు.. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రీన్ క్యాంపస్ అవార్డును అందించనున్నారు మోదీ. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేసే రైతులతోనూ మాట్లాడనున్నారు.
ఇదీ చదవండి:
' దేశ ఆరోగ్య రంగంలో 'డిజిటల్ హెల్త్ మిషన్' విప్లవాత్మక నిర్ణయం '