వారణాసి డాక్టర్లతో, ఫ్రంట్లైన్ వర్కర్లతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ వేదికగా మాట్లాడనున్నారు. పారా మెడికల్ సిబ్బంది కూడా ఈ సమీక్షలో పాల్గొననున్నారు.
వారణాసిలోని కొవిడ్ ఆసుపత్రుల పరిస్థితులపై మోదీ ఆరాతీయనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. డీఆర్డీఓ, భారత ఆర్మీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పండిట్ రాజన్ మిశ్రా కొవిడ్ ఆసుపత్రి గురించి అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపింది.
ఈ వర్చువల్ భేటీలో.. జిల్లాలోని ఇతర ఆసుపత్రుల్లో పరిస్థితుల గురించి ప్రధానికి వివరించనున్నారు డాక్టర్లు. కొవిడ్ కట్టడికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:ఉచిత టీకా కోసం మోదీకి మాజీ ఐఏఎస్ల లేఖ