ETV Bharat / bharat

నేడు వారణాసిలో మోదీ పర్యటన - బెనారస్​ హిందూ విశ్వవిద్యాలయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ. 744 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు దాదాపు రూ. 839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

modi varanasi visit
మోదీ కాశీ పర్యటన
author img

By

Published : Jul 15, 2021, 4:53 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు దాదాపు రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లోని ఎంసీహెచ్‌లో 100 పడకల ఆసుపత్రితో పాటు మల్టీ పార్కింగ్‌, గంగా నదిలో పర్యాటకాభివృద్ధికి ఉద్దేశించిన రోరో బోట్లను ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో పాటు వారణాసి- ఘాజీపూర్ జాతీయ రహదారిపై నిర్మించిన మూడు లైన్ల ఫ్లైఓవర్‌ వంతెనను ప్రారంభిస్తారు.

అలాగే, మధ్యాహ్నం 12.15 గంటలకు జపాన్‌ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ 'రుద్రాక్ష్‌'ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు బీహెచ్‌యూలోని మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని ప్రధాని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత వైద్యులు, ఉన్నతాధికారులతో కరోనా సన్నద్ధతపై సమీక్షిస్తారు.

ఇదీ చూడండి: వాటిపై చర్చకు రాహుల్ పట్టు- నో చెప్పిన ఛైర్మన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.