ETV Bharat / bharat

నేడు బంగాల్​లో ఆసుపత్రి ప్రారంభించనున్న మోదీ

ఐఐటీ ఖరగ్​పుర్​లో నిర్మించిన డాక్టర్​ శ్యామ ప్రసాద్​ ముఖర్జీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​, రీసర్చ్​ కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా హాజరుకానున్నారు. అలాగే.. ఐఐటీ ఖరగ్​పుర్​ 66వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Feb 23, 2021, 5:01 AM IST

బంగాల్​లోని ఐఐటీ ఖరగ్​పుర్​లో ఏర్పాటు చేసిన డాక్టర్​ శ్యామ ప్రసాద్​ ముఖర్జీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​​, రీసర్చ్​ కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అలాగే.. ఐఐటీ ఖరగ్​పుర్​ 66వ స్నాతకోత్సవంలో మధ్యాహ్నం 12.30 గంటలకు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించింది.

డాక్టర్​ శ్యామ ప్రసాద్​ ముఖర్జీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​, రీసర్చ్​ కేంద్రం ఒక సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి. కేంద్ర విద్యాశాఖ సహకారంతో దీనిని ఐఐటీ ఖరగ్​పుర్​ ఏర్పాటు చేసింది. శాస్త్రీయ, సాంకేతిక, నూతన ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెంచి పరిశోధనల్లో భారత్​ను మేటిగా నిలపాలనే ప్రధాని మోదీ విజన్​లోనిదే ఈ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేర్కొంది పీఎంఓ. దానిని ఆరోగ్య రంగం, సాంకేతికతల మధ్య ఉత్పన్నమైన శక్తిగా కొనియాడింది.

ఈ కార్యక్రమానికి బంగాల్​ గవర్నర్​, కేంద్ర విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ సహాయ మంత్రి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఇదీ చూడండి: 'బంగాల్​లో సిండికేట్ రాజ్యం- పైసలిస్తేనే పని'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.