ETV Bharat / bharat

నేడు మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్​ భేటీ - నీతి ఆయోగ్​ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశం కానుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా తొలిసారి లద్దాఖ్​ ఇందులో భాగం కానుంది. ప్రధానంగా వ్యవసాయం, మౌలిక వసతులు, ఉత్పత్తి, ఆరోగ్యం, కరోనా అనంతర పరిస్థితులు వంటి అంశాలపై చర్చించనున్నారు.

Niti Aayog's Governing Council meeting
నేడు మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్​ పాలక మండలి భేటీ
author img

By

Published : Feb 20, 2021, 5:00 AM IST

నీతి ఆయోగ్​ పాలక మండలి ఆరో సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరగనుంది. వ్యవసాయం, మౌలిక వసతులు, ఉత్పత్తి, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, కరోనా అనంతర పరిస్థితులు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్​ గవర్నర్లు, పలువురు కేంద్రం మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారు.

నీతి ఆయోగ్​ పాలక మండలి ఆరో సమావేశంలో కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్​తో పాటు తొలిసారి లద్దాఖ్​ భాగం కానుంది. ఈసారి ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల అధినేతలను సైతం ఆహ్వానించారు. అలాగే.. పాలక మండలి ఎక్స్​ అఫిసియో సభ్యులు, వైస్​ ఛైర్మన్​, సభ్యులు, సీఈఓ, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

పాలక మండలి సమావేశం తొలిసారి 2015, ఫిబ్రవరి 8న జరగగా.. అప్పటి నుంచి క్రమం తప్పకుండా జరుగుతోంది. అయితే.. కరోనా కారణంగా గత ఏడాది సమావేశం రద్దయింది.

మమత, అమరిందర్​ దూరం..!

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​ అనారోగ్యం కారణంగా నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశానికి దూరం కానున్నారు. ఆయన స్థానంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్​ప్రీత్​ సింగ్​ బాదల్​ హాజరుకానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ సమావేశానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ తీర్పుపై భారత్ 'సవాల్'‌?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.