ETV Bharat / bharat

కరోనా ఉద్ధృతిపై నేడు ముఖ్యమంత్రులతో మోదీ భేటీ - నరేంద్ర మోదీ

నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్​గా భేటీ కానున్నారు ప్రధాని మోదీ. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్​ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. శ్రీ గురు తేగ్​ బహదూర్​ 400వ జయంతిని పురస్కరించుకుని నేడు ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలోనూ పాల్గొననున్నారు.

modi pm modi
మోదీ, నరేంద్ర మోదీ
author img

By

Published : Apr 8, 2021, 5:00 AM IST

Updated : Apr 8, 2021, 6:32 AM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు వర్చువల్​గా సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్​పై చర్చించనున్నారు. కొవిడ్​ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా దిశా నిర్దేశం చేయనున్నారు.

తేగ్ బహదూర్​ జయంతి

శ్రీ గురు తేగ్​ బహదూర్​ 400వ జయంతిని పురస్కరించుకుని నేడు ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలోనూ మోదీ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్​గా జరిగే ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరవుతారు.

తేగ్ బహదూర్ 400వ జయంతిని ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఉన్నత స్థాయి కమిటీని 2020 అక్టోబర్ 24న కేంద్రం ఏర్పాటు చేసింది. 70 మంది సభ్యులున్న ఈ కమిటీకి ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తారు. తేగ్ బహదూర్ స్మారకార్థం ఈ ఏడాది పొడవునా నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు, వాటి ప్రణాళికల గురించి ఇవాళ్టి భేటీలో చర్చిస్తారు.

ఇదీ చూడండి: రోజుని అలా ప్రారంభించడమే నాకిష్టం: మోదీ

Last Updated : Apr 8, 2021, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.