ETV Bharat / bharat

'మణిపుర్ అంశంపై మోదీ అస్సలు మాట్లాడలేదు.. మొత్తం రాజకీయ ప్రసంగమే!' - మోదీ ప్రసంగం మల్లికార్జున ఖర్గే రియాక్షన్

Pm Modi Speech Today Opposition Reaction : ఎన్​డీఏ ప్రభుత్వంపై ప్రవేశపట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. ప్రధాని 90 నిమిషాల్లో మణిపుర్ అంశం లేవనెత్తలేదని మండిపడ్డాయి. మోదీ పూర్తిగా రాజకీయ ప్రసంగమేనని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్​ నేత అధీర్ రంజన్ చౌధురీను లోక్​సభ సస్పెండ్​ చేసింది.

Pm Modi Speech Today Opposition Reaction Oppsition

author img

By

Published : Aug 10, 2023, 10:00 PM IST

Updated : Aug 10, 2023, 10:55 PM IST

Pm Modi Speech Today Opposition Reaction : అవిశ్వాసం తీర్మానంపై చర్చకు సమధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. తొలి 90 నిమిషాల్లో మణిపుర్​ అంశాన్ని ప్రస్తావించలేదని మండిపడ్డాయి. ఆ సమయంలో తాము చాలా సార్లు జోక్యం చేసుకున్నా ఆయన వినలేదని మండిపడ్డాయి. మోదీ చేసింది కేవలం రాజకీయ ప్రసంగమని విమర్శించాయి.

అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీగా ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ సుదీర్ఘ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్​ స్పందించారు. 'మణిపుర్‌పై జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మేము ప్రధానిని కోరాము. గంట 45 నిమిషాల తర్వాత కూడా మోదీ మణిపుర్ పదాన్ని ప్రస్తావించలేదు. ఆయన పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలపై పాత పాటే పాడారు. అవమానాలు అన్నీ జరిగాయి. కానీ అవిశ్వాస తీర్మానం ద్వారా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు లేవు' అని థరూర్ అసహనం వ్యక్తం చేశారు.

"తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది- మణిపుర్ ప్రజలకు న్యాయం జరగడ. రెండోది- మణిపుర్ సమస్యపై ప్రధాని మోదీ మాట్లాడటం. చాలా కాలం తర్వాత, ప్రధాని సభలో మాట్లాడటం దేశం చూడగలిగింది. మేము ఆయన మౌనాన్ని వీడమని బలవంతం చేశాం. కానీ మణిపుర్‌కు న్యాయం చేయాలనే మా లక్ష్యం నెరవేరలేదు. ప్రధాని మోదీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు"
-- గౌరవ్ గొగొయ్​, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్​ ఎంపీ

  • #WATCH | Delhi: Congress MP Gaurav Gogoi says, "We staged a walkout because we didn't get the answer to these three questions in the last two hours. Keeping in mind our responsibility towards the people of Manipur, the I.N.D.I.A. alliance parties walked out..." pic.twitter.com/A6Pf4ba0OZ

    — ANI (@ANI) August 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అవిశ్వాస తీర్మానం ఉద్దేశం.. మణిపుర్, హరియాణా వంటి ఇతర ప్రాంతాలపై జరుగుతున్న హింసపై ఆయన స్పందన వినడమేనని.. కానీ తాము చాలాసార్లు జోక్యం చేసుకున్నా ఆయన స్పందించలేదని తమిళనాడు డీఎమ్​కే పార్టీ ఎంపీ టీఆర్​ బాలు అన్నారు. భారత చరిత్రలో గొప్ప స్పిన్నర్ ఎవరనే చర్చ సెటిల్ అయిందని.. అది ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు.

మణిపుర్ గురించి మోదీ ఏమీ మాట్లాడలేదు : డింపుల్ యాదవ్
'అవిశ్వాస తీర్మానానికి కారణం.. మణిపుర్‌లో అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. పిల్లల చనిపోయారు. అనేక ఇతర సంఘటనలు ఉన్నాయి. అయితే మణిపుర్ గురించి ప్రధాని ఏమీ మాట్లాడలేదు. మణిపుర్ ప్రజలతో నిలబడలేదు. అందుకే ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి' అని సమాజ్​వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ తెలిపారు.

  • #WATCH | Samajwadi Party MP Dimple Yadav says, "The reason behind the no-confidence motion was Manipur where several women were raped, children were killed and several other incidents but PM didn't say anything about Manipur and didn't stand with the people of Manipur & that's… pic.twitter.com/08CBlzkks8

దేశమంతా మీ వెంటే ఉంటే.. కాంగ్రెస్‌ను చూసి భయమెందుకు?: అధిర్‌
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కూడా మణిపుర్‌ అంశంపై మౌనం (నిరవ్‌)గానే ఉండిపోయారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి అన్నారు. మోదీ మౌనం వల్లే తాము వాకౌట్‌ చేయాల్సి వచ్చిందన్నారు. దేశమంతా మోదీ వెంటే ఉంటే మరి కాంగ్రెస్‌కు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. దాదాపు 1.45 గంటల పాటు ప్రతిపక్షాలు చాలా అవమానాలు, దూషణలను విన్నాయని.. చాలా ఓపికతో వ్యవహరించాయని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు.

మణిపుర్‌పై మాట్లాడతారని చూశాం..: సుప్రియా సూలే
ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రోవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపుర్‌ హింస, అక్కడి మహిళలపై అకృత్యాలపై మాట్లాడతారని ఎంతగానో ఎదురుచూశామని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. కానీ ఆయన చేసిన 90శాతం ప్రసంగం 'ఇండియా' కూటమి గురించే సాగిందని విమర్శించారు.

అధీర్ రంజన్ చౌధురీపై సస్పెన్షన్ వేటు..
కాంగ్రెస్ నేత అధీర్​ రంజన్ చౌధురీపై లోక్​సభ సస్వెన్షన్ వేటు వేసింది. ప్రివిలేజెస్ కమిటీ విచారణ జపురుతున్నందున పదే పదే దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు సస్పెండ్ చేసింది. అధీర్​ రంజన్ సస్పెన్షన్​కు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి ప్రవేశపెట్టారు. ప్రధాని, మంత్రులు మాట్లాడినప్పుడల్లా సభకు అంతరాయం కలిగించారని అన్నారు.

Adhir Ranjan Comment On Modi : అయితే అధీర్​ రంజన్​ను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్​ తప్పుబట్టింది. ఈ చర్యను నమ్మలేనిది, అప్రజాస్వామికమైనదిగా అభివర్ణించింది. అయితే, దీనిపై అధీర్​ రంజన్ చౌధురీ వివరణ ఇచ్చారు. తాను ప్రధానిని అవమానించలేదని.. తన ఉద్దేశం అది కాదని అన్నారు. మోదీ కూడా తనను అవమానించినట్లు భావించలేదని.. కానీ సభ్యులు కొందరు అలా అనుకుని తనపై సస్వెన్షన్ ప్రతిపాదన తీసుకొచ్చారని తెలిపారు.

  • #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury says, "...I have not insulted PM Modi. Modi ji speaks on everything but on Manipur issue, he is sitting 'Nirav', which means sitting silent. 'Nirav' means to be silent. My intention was not to insult PM Modi... PM Modi did not feel that… https://t.co/lFaAMZ3yKr pic.twitter.com/COJ3wT9bJ5

'మణిపుర్​లో భరతమాత హత్య.. అందుకే ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ దూరం'

'ప్రధాని మౌనవ్రతం ముగించేందుకే అవిశ్వాసం.. వీడియోలు రాకుంటే మోదీ నోరు విప్పేవారు కాదు'

Last Updated : Aug 10, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.