ETV Bharat / bharat

ఇరిగేషన్‌ స్కీమ్‌లను కేసీఆర్‌ ఇరిగేషన్‌ స్కామ్‌లు చేశారు : పీఎం మోదీ

PM Modi Speech in BJP Public Meeting at Maheshwaram : ఇరిగేషన్‌ స్కీమ్‌లను కేసీఆర్‌ ఇరిగేషన్‌ స్కామ్‌లు చేశారని పీఎం మోదీ దుయ్యబట్టారు. అలాగే తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని హర్షించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుక్కుగూడలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు.

PM Modi
PM Modi Speech in BJP Public Meeting at Maheshwaram
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 5:21 PM IST

PM Modi Speech in BJP Public Meeting at Maheshwaram : తెలంగాణలో బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని.. ఇక్కడి ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. బీఆర్‌ఎస్‌ అవినీతి వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రాలేదని ఆవేదన చెందారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుక్కుగూడలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని.. బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో(Telangana Elections) బీఆర్‌ఎస్‌ను దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీలలో ప్రజలు తిప్పికొట్టారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే బీఆర్‌ఎస్‌కు వేయడమే అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని చెప్పారు. కానీ బీజేపీ అలాకాదు.. తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమంటూ.. మహేశ్వరం ప్రజలకు తెలిపారు.

PM Modi Telangana Election Campaign : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రెండు స్వార్థ పార్టీలని.. సమాజ విరోధులు అని పీఎం మోదీ ధ్వజమెత్తారు. మోదీని తిట్టడమంటే కేసీఆర్‌కు మహాఇష్టం.. ఇరిగేషన్‌ స్కీమ్‌లను కేసీఆర్‌ ఇరిగేషన్‌ స్కామ్‌లు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తి సీఎం(BC CM BJP Slogan) అవుతారని స్పష్టం చేశారు. మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేశామని.. బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు లాభం చేకూరుతుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోతోందని విమర్శలు చేశారు.

బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ వ్యాట్‌ తగ్గిస్తాం : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే పెట్రోల్‌, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తగ్గిస్తామని ప్రధాని మోదీ మాటిచ్చారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని కోరారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌(PM Kishan Samman) నిధి ద్వారా రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల కోట్లు జమ చేశామని హర్షించారు. రైతులకు రూ.300లకే యూరియా బస్తా ఇస్తున్నామని.. తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్‌ రైస్‌ కొంటున్నామన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే బీఆర్‌ఎస్‌కు కార్బన్‌ సర్కార్‌లా పని చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే బీజేపీకు ఓటు వేయాలని.. మహేశ్వరం సభకు విచ్చేసిన సభికులను ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

ఈ ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే - సీఎం అయ్యేది బీసీ వ్యక్తినే : ప్రధాని మోదీ

బీఆర్ఎస్, కాంగ్రెస్ అజెండా ఒక్కటే - వ్యక్తిగత అభివృద్ధి కోసం కృషి చేస్తారు : యోగి ఆదిత్యనాథ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.