అఫ్గానిస్థాన్‌లో పరిణామాలు వేగంగా మారిపోయి, తాలిబన్ల శకం ఆరంభమైన వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక చర్చ(PM Modi Putin phone call) జరిగింది. ఇరువురు దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు.
అఫ్గాన్ అంశంపై పుతిన్(Russian President Vladimir Putin)తో కలిసి వివరంగా చర్చించినట్లు మోదీ తెలిపారు. కరోనాపై పోరులో సహకారం సహా ద్వైపాక్షిక అంశాలపైనా మాట్లాడుకున్నట్లు మోదీ(PM Modi) చెప్పారు.
"అఫ్గానిస్థాన్‌లో పరిణామాలపై నా మిత్రుడు పుతిన్‌తో అభిప్రాయాలు పంచుకున్నా. ద్వైపాక్షిక అజెండా, కొవిడ్‌పై భారత్- రష్యా మధ్య భాగస్వామ్యం గురించి చర్చించాం. ముఖ్యమైన విషయాలపై ఇరువురూ సంప్రదింపులు జరుపుకోవాలని అంగీకరించుకున్నాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సోమవారం జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్(German Chancellor Angela Merkel)తోనూ చర్చలు జరిపారు మోదీ. అఫ్గాన్ సంక్షోభం(Afghan crisis)పై నేతలిద్దరూ మాట్లాడుకున్నారని పీఎంఓ తెలిపింది. అఫ్గాన్‌లో శాంతిభద్రతలు కాపాడటం కీలకమని ఇరువురు పేర్కొన్నట్లు పీఎంఓ ప్రకటన వెల్లడించింది. అక్కడ చిక్కుకున్నవారిని రప్పించేందుకు నేతలు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: