దేశవ్యాప్తంగా కరోనా కల్లోలానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని ఆరోపించారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. వైరస్‌ను కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కోల్‌కతాలోని దాకురియా బ్రిడ్జ్ నుంచి కాళీఘాట్ క్రాసింగ్ వరకు రోడ్ షో నిర్వహించారు మమత. బంగాల్‌కు 5కోట్ల 40లక్షల టీకా డోసులను పంపించాలని విజ్ఞప్తి చేసినా.. ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
![mamata rally in kolkata](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11450732_4.jpg)
![amid covid-19 spread mamata rally in kolkata](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11450732_1.jpg)
" వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి కార్యాచరణను పాటించలేదు. గుజరాత్లో పరిస్థితి దయనీయంగా మారింది. దేశంలో ఆక్సిజన్, ఔషధాల కొరతకు కారణం ఎవరు? బంగాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రానికి 5కోట్ల 40లక్షల టీకా డోసులు, ఆక్సిజన్, ఔషధాలను పంపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాను."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
80 దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను ప్రధాని సరఫరా చేయటంపై మమత స్పందించారు. మోదీ.. తన కీర్తిని పెంచుకోవటం కోసమే ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపించారని ఆరోపించారు. ఇప్పుడు దేశంలో టీకాల కొరత నెలకొందన్నారు.
![didi rally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11450732_img.jpg)
ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపించేముందు మహారాష్ట్ర, యూపీ, బంగాల్.. మిగతా రాష్ట్రాలకు అందించాలని సూచించారు.
ఇదీ చదవండి : రైల్వే సాయం కోరిన దిల్లీ ప్రభుత్వం