ETV Bharat / bharat

'మోదీ కొత్త కారు రూ.12 కోట్లు కాదు.. ఇంతే...' - మోదీ కొత్త కారు ధర

PM modi security car: ప్రధాని మోదీ భద్రత కోసం కొనుగోలు చేసిన కొత్త కారు విలువ రూ.12 కోట్లు కాదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాధారణ ఆడిట్ నిర్వహించి కార్లను మార్చినట్లు స్పష్టం చేశాయి. ఇందులో మోదీ ప్రమేయం ఏమీ లేదని, ఎస్​పీజీ స్వతంత్రంగా దీనిపై నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి.

Mercedes Maybach S650 cost
మోదీ కొత్త కారు ధర రూ.12 కోట్లు కాదు
author img

By

Published : Dec 29, 2021, 1:58 PM IST

Mercedes Maybach S650 cost: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు ఉపయోగించే కారు ఖరీదు రూ.12 కోట్లు అని వచ్చిన వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. 'మెర్సిడీస్ మేబాక్ ఎస్-650 గార్డ్' విలువ... వార్తల్లో వచ్చిన దానిలో మూడో వంతే(సుమారు రూ.4 కోట్లు) ఉంటుందని తెలిపాయి. మోదీ ఇదివరకు ఉపయోగించే కార్ల తయారీని బీఎండబ్ల్యూ సంస్థ నిలిపివేయడం వల్ల తాజా మోడల్​ను ఆయన రక్షణ కోసం ప్రవేశపెట్టినట్లు వెల్లడించాయి.

SPG Modi security

సాధారణ రీప్లేస్​మెంట్​లో భాగంగానే కొత్త కార్లను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్​పీజీ) స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకుందని.. ఇందులో మోదీ ప్రమేయం లేదని చెప్పాయి.

"మీడియాలో వచ్చిన దానికంటే కారు ఖరీదు చాలా తక్కువ. నిజానికి మీడియాలో ప్రచారమైనదానికి మూడో వంతే ఉంటుంది. ప్రతి ఆరేళ్లకోసారి ఈ వాహనాలను మార్చాలని ఎస్​పీజీ నిబంధనల్లో ఉంది. ఇదివరకు కార్లను మోదీ ఎనిమిదేళ్ల పాటు ఉపయోగించారు. కార్ల ఆడిట్ సమయంలో అభ్యంతరాలు తలెత్తాయి. రక్షణ పొందే వ్యక్తి(ప్రధాని) ప్రాణాలకు ఉన్న ముప్పును బట్టి కొత్త వాహనాల కొనుగోలు ఉంటుంది. ఈ నిర్ణయం రక్షణ పొందే వ్యక్తితో సంబంధం లేకుండా ఎస్​పీజీ స్వతంత్రంగా తీసుకుంటుంది."

-ప్రభుత్వ వర్గాలు

మోదీ వినియోగించే కార్లపై ఈ విధంగా విస్తృత చర్చ జరగడం దేశప్రయోజనాలకు మంచిది కాదని అధికారులు పేర్కొన్నారు. అనవసర విషయాలన్నీ ప్రజాబాహుళ్యంలోకి వెళ్లిపోతాయని, ఇది రక్షణ పొందే వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

ఏ కార్లు వాడాలో అనే విషయంపై మోదీకి ఎలాంటి ప్రాధాన్యాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గతంలో రేంజ్ రోవర్ కార్లు వినియోగించారని.. నిజానికి అవి అప్పటి ప్రధానమంత్రి కోసం కొనుగోలు చేసినవని గుర్తు చేశారు.

ఎన్నో అధునాతన ఫీచర్లు

PM modi security car features: వీఆర్‌-10 స్థాయి భద్రతను కల్పించే ఈ కారు ఖరీదు రూ.12 కోట్ల పైమాటేనని మంగళవారం వార్తలు వచ్చాయి. అయితే, ప్రభుత్వ వర్గాల తాజా వివరణ ప్రకారం దీని ఖరీదు.. రూ.4 కోట్లేనని తెలుస్తోంది.

సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. కారు బాడీ, విండోస్‌ ఏకే-47 తూటాలను తట్టుకొని నిలబడతాయి. దీనితో పాటు ఎన్నో రక్షణ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.